‘దారి’ తీసిన గొడవ

‘దారి’ తీసిన గొడవ


రాళ్ల దాడిలో ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

వికారాబాద్‌ జిల్లాలో ఘటన




దోమ: దారికి అడ్డంగా బైక్‌ పెట్టడంతో మొదలైన గొడవ చివరకు ఒకరి ప్రాణాన్ని బలి గొంది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా దోమ మండలం ఐనాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన గుడ్ల రాజు కొన్నిరోజుల క్రితం తన పొలంలో బోరుబావి తవ్వించాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం స్నేహితులు యాదయ్య, నరేందర్, బుగ్గయ్య, నర్సింలుతో కలసి విందు ఏర్పాటు చేశాడు. రాజు పొలానికి వెళ్లే దారిలోనే గ్రామానికి చెందిన సుజాజొద్దీన్‌ (50) పొలం ఉంది. గురువారం సాయంత్రం ఆయన కుమారులు సైఫొద్దీన్, అహ్మద్‌ తమ పొలం దగ్గర దారికి అడ్డంగా బైక్‌ నిలిపి ఉంచడంతో యాదయ్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.



దీంతో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యాదయ్య విందులో ఉన్న తన స్నేహితులకు చెప్పడం తో వారు అక్కడికి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సుజాజొద్దీన్‌ రాత్రి మరోవర్గానికి చెందిన వారిని పిలిపించి సర్ది చెప్పాడు. అనంతరం వారిని మరోసారి  తిరిగి పిలిపించడంతో గొడవ మొదలైంది. దీంతో సుజాజొద్దీన్, అహ్మద్, సైఫొద్దీన్‌లపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సుజాజొద్దీన్‌ మృతి చెందగా.. సైఫొద్దీన్‌ పరిస్థితి విషమం గా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.



వివరాలు సేకరించిన ఎస్పీ  

ఎస్పీ నవీన్‌కుమార్‌ శుక్రవారం ఘటన స్థలా నికి చేరుకొని గొడవకు దారి తీసిన కార ణాలను పరిగి డీఎస్పీ అశ్ఫక్, సీఐ ప్రసాద్, ఎస్‌ఐ ఖలీల్‌ను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top