హెడ్డాఫీసు నుంచి మాట్లాడుతున్నా...


బ్యాంక్ హెడ్డ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అని మాయ మాటలు చెప్పి.. అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం ఓగ్లాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పశువుల ఆస్పత్రిలో గోపాలమిత్రగా పనిచేస్తున్న బోయిని శ్రీనివాస్‌కు ఈ నెల 26న ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసింది. తాను బ్యాంక్ హెడ్డాఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. శ్రీనివాస్‌ను పేరు అడిగి నిర్ధారణ చేసుకుంది. ఆ తర్వాత అతని పూర్తి పేరు, స్టేట్‌బ్యాంకు అకౌంట్, అడ్రస్ అడిగింది. తనకు స్టేట్ బ్యాంకు అకౌంట్ లేదని శ్రీనివాస్ చెప్పటంతో ఆంధ్రాబ్యాంకులో ఉందా అని అడిగింది.



దీంతో కొద్ది రోజుల క్రితం తాను పోగొట్టుకున్న ఏటీఎం కి సంబంధించి  ఏటీఎం పిన్ నంబర్ సహా వివరాలు చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత రూ.5000వేలు డ్రా అయినట్లు, తరువాత రెండు సార్లు రూ.4000, మళ్లీ రూ.5000వేలు.. ఇలా మెత్తం రూ.18,000 డ్రా చేసినట్లు శ్రీనివాస్ ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఆంధ్రాబ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. వారి సూచన మేరకు వెంటనే ఈ విషయాన్ని పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



ఎస్‌బీఐ హెడ్డాఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని అడగటం వల్లనే ఏటిఎం కార్డు పిన్ నంబర్ చెప్పానని బాధితుడు శ్రీనివాస్ తెలిపాడు. ఆరు నెలల క్రితం తన స్టేట్ బ్యాంకు ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ లు పోయాయని వివరించాడు. వాటి గురించే అడుగుతున్నారని భావించి పూర్తి వివరాలు చెప్పానని శ్రీనివాస్ వాపోయాడు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top