26న అథ్లెటిక్స్‌ మీట్‌


ఒంగోలు : స్థానిక ఏబీఎం జూనియర్‌ కాలేజీ ఆవరణలో ఈ నెల 26వ తేదీ అథ్లెటిక్స్‌ మీట్‌ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.జాన్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

ఉదయం 9.30 గంటలకు ఈ మీట్‌ ప్రారంభమవుతుందన్నారు. అండర్‌–14, 16, 18, 20 సంవత్సరాల్లోపు వయస్సు గల వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. వందమీటర్లు, 200, 400, 600, 800, 1500, 2 వేలు, 3 వేలు, 5 వేలు, 10 వేలు, 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లకు సంబంధించి మీట్‌ ఉంటుందని చెప్పారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపికచేసి సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో విజయవాడలో నిర్వహించే ఏపీ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌కు పంపిస్తామన్నారు.

 

పోటీల్లో పాల్గొనదలచిన అభ్యర్థి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ను తహసీల్దారు వద్దనుంచిగానీ, నగరాలలో జన్మించి ఉంటే కమిషనర్‌ వద్దనుంచిగానీ, గ్రామాల్లో జన్మించి ఉంటే గ్రామ సర్పంచ్‌ దగ్గర గానీ తీసుకురావాలని సూచించారు. ఆధార్‌ కార్డు కూడా తీసుకురావాలన్నారు. ఆసక్తిగల బాలబాలికలు ఏబీఎం జూనియర్‌ కాలేజీ పీడీ డేవిడ్, వూళ్లపాలెం పీఈటీ మురళి, నత్తల కృష్ణ, పి.సుధాకర్‌ వద్ద రిపోర్టుచేయాలని ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.జాన్‌బాబు పేర్కొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top