ముగిసిన అథ్లెటిక్‌ పోటీలు


వట్లూరు (పెదపాడు) :  సర్‌ ïసీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు బుధవారంతో ముగిశాయి. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. కళాశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యక్షుడు వీవీ బాల కృష్ణారావు, కార్యదర్శి ఎంవీకే దుర్గారావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ యూఎం ఎస్‌.రామప్రసాద్,  యాజమాన్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 

∙మహిళల పోటీలు 100మీ విభాగంలో కె.విజయలక్షి్మ(విశాఖపట్నం), 5 కిమీ విభాగంలో ఎం. మౌనిక విజయనగరం, 5 కిమీ నడక విభాగంలో డి.శేషారత్నం(ఏలూరు), 100 మీ హార్డిల్స్‌లో 

∙కె.సుశీల (విజయనగరం), 400 మీ రిలే విభాగంలో సీహెచ్‌ వెంకటలక్ష్మి, కె.రమాదేవి, కె.విజయలక్ష్మి, సీహెచ్‌ వాణి(విశాఖపట్నం), షాట్‌పుట్‌ విభాగంలో సీహెచ్‌ ఉమ (విజయనగరం), 

∙జావెలిన్‌ త్రోలో  బి.సంధ్యారాణి(విశాఖపట్నం), హై జంప్‌ విభాగంలో ఒ.భవానీ(విశాఖపట్నం), 

∙హెఫ్తాలాన్‌ విభాగంలో ఎం.లావణ్య (బొబ్బిలి) విజేతలుగా నిలిచారు. 

∙పురుషుల 100 మీ విభాగంలో ఎల్‌.జనార్దనరావు(విశాఖపట్నం), 5 కిమీ విభాగంలో టి.అప్పారావు (విశాఖపట్నం), 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఎస్‌ రాజు (విశాఖపట్నం), 400 మీ.హార్డిల్స్‌లో టి.వెంకటరావు (బొబ్బిలి), 100 మీ రిలే విభాగంలో ఎల్‌ జనార్దనరావు పీడీవై తేజ, ఎన్‌.గౌతమ్‌రెడ్డి, ఆర్‌కుమార్‌ నాయక్‌(విశాఖపట్నం), 400 రిలే విభాగంలో కె.కృష్ణమూర్తి, ఎల్‌.సాయికుమార్, బి.మురళీరాధ, ఎస్‌.వంశీకృష్ణ(విశాఖపట్నం), జావెలిన్‌త్రో విభాగంలో పి.రామకృష్ణ(కొత్తవలస), హమ్మర్‌ త్రో విభాగంలో ఎల్‌.కిరణ్‌కుమార్, హై జంప్‌ ఎన్‌.సింహాచలం (కొత్తవలస), డెకత్లాన్‌ పోటీలలో ఎ.అప్పన్న(విశాఖపట్నం) విజేతలుగా నిలిచారు. ఓవరాల్‌ చాంపియన్‌గా ఎస్‌వీవీపీవీఎంసీ డిగ్రీ కళాశాల విశాఖపట్నం నిలిచింది. ఇదే కళాశాలకు చెందిన ఎల్‌.జనార్దనరావు పాస్టెస్టు మన్‌ అవార్డు పొందాడు. 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top