తాత్కలిక అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


అనంతగిరి: వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని ప్రిన్సిపాల్‌ మహాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ అర్హత కలిగి, అనుభవం ఉన్నవారు దరఖాస్తులను ఈనెల 13లోగా కళాశాలలో సమర్పించాలన్నారు.



మెత్తం 8పోస్టుల భర్తీ కోసం సబ్జెక్టుల వారిగా నియామకాలు చేపడుతామని తెలిపారు. తెలుగు మీడియంలో ఆంగ్లం, అర్ధశాస్త్రం, పౌరశాస్త్త్రంలు, ఉర్దూ విభాగంలో చరిత్ర, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, వ్యాపార గణాంకశాస్త్రం, ఉర్దూలు ఖాళీలున్నాయన్నారు. కావున అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top