గోదావరిపై మరో ఆనకట్ట

గోదావరిపై మరో ఆనకట్ట


నిర్మల్‌(మామడ) : గోదావరి నదిపై మరో ఆనకట్టను నిర్మాణం కానుంది. మామడ మండలంలోని పొన్కల్‌ సమీపంలో గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.



రూ.516 కోట్ల నిధులతో బ్యారేజీ నిర్మాణ పనులు

గోదావరి నదిపై శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిర్మాణం కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. పొన్కల్‌ వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మాణం కోసం 2008లో సర్వే నిర్వహించి, నిర్మాణానికి రూ.500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఖానాపూర్‌ పట్టణంలో శిలాçఫలానికి శంకుస్థాపన చేశారు. తదనంతరం పరిణామాల కారణంగా బ్యారేజీ నిర్మాణం వాయిదా పడింది. మళీర్ల గతేడాది అధికారులు బ్యారేజీ నిర్మాణం కోసం సర్వే నిర్వహించి నిర్మాణ వ్యయం రూ.516 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ని««దlులను మంజూరు చేసింది.



15 వేల ఎకరాలకు సాగునీరు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 42 కిలోమీటర్ల దిగువన, సదర్‌మాట్‌ ప్రాజెక్టుకు 7 కిలోమీటర్ల ఎగువన ఈ బ్యారేజీని నిర్మించనున్నారు. పొడవు 1,250 మీటర్లు ఉండగా, బ్యారేజీలో 150 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్యారేజీకి 56 గేట్లను అమర్చనున్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మామడ మండలంలోని పొన్కల్, ఆదర్శనగర్, కమల్‌కోట్‌ గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ భూములు 1200 ఎకరాలు, జగిత్యాల జిల్లాలోని మూలరాంపూర్‌ గ్రామ రైతుల వ్యవసాయ భూములు 400 ఎకరాల ముంపునకు గురవుతున్నాయని అధికారులు సర్వేలో సూచించారు. కడెం, ఖానాపూర్‌ మండలంలోని 15 వేల ఎకరాల భూమి సాగులకు రానుంది.



నష్టపరిహారం అందాలి

బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.8.50 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు అందించేందుకు అధికారులు గ్రామసభలను నిర్వహించి భూముల ధరలను నిర్ణయించి నివేదికలు పంపించారు. నష్టపరిహారం అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. బ్యారేజీ నిర్మాణం అనంతరం దాని నుంచి ఎత్తిపోతల ద్వారా చెరువులకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణంతో ఇక్కడి ప్రాంత రైతులకు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నారు. చేపల పెంపకానికి అనుకూలంగా ఉపాధి లభిస్తుందని మత్స్యకారులు భావిస్తున్నారు.



పట్టాలు అందించాలి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మా భూములను కోల్పాయాం. పునరావాసంగా ఆదర్శనగర్‌లో భూములను చూపించారు. భూములను బాగు చేసుకుని వ్యవసాయం చేస్తున్నాం. ప్రస్తుతం సదర్‌మాట్‌ మినీ బ్యారేజీ నిర్మాణంలోనూ మా భూములు ముంపునకు గురవుతున్నాయి. చాలా మంది రైతులకు డి1 పట్టాలు మాత్రమే ఉన్నాయి. సెత్వార్‌ అందించి సమస్యను పరిష్కరించాలి.

– గంగారెడ్డి, రైతు, ఆదర్శనగర్‌



ఎత్తిపోతల నీరందించాలి

సదర్‌మాట్‌ బ్యారేజీ అనంతరం ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలి. ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు నీటిని అందిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలి.

– రమేశ్, రైతు, పొన్కల్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top