'సైకో లక్షణాలన్నీ ఆయనకే ఉన్నాయి'

'సైకో లక్షణాలన్నీ ఆయనకే ఉన్నాయి' - Sakshi


హైదరాబాద్: అసందర్భ ప్రేలాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే  అసలైన సైకో లక్షణాలున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా శుక్రవారం జరిగిన సభలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సైకో అంటూ అధికార పార్టీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగడంపై అంబటి మండిపడ్డారు. అసలు సైకో లక్షణాలు చంద్రబాబుకే అధికంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.



ఓటుకు కోట్లు కేసులో సభలో చర్చకు పట్టుబడితే అందుకు అనుమతి ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమన్నారు.  ప్రధానమైన విషయాన్ని పక్కదోవ పట్టించి.. వైఎస్ జగన్ పై విమర్శలు  చేయడం  దురదృష్టకరమన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో తలదించుకునే, ఖూనీ చేసే ఘటనగా అంబటి అభివర్ణించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనా.. ఇంకా తాను నిప్పులాంటి మనిషిని అంటూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం సిగ్గుచేటు కాకపోతే ఏమిటని ప్రశ్నించారు.


 


తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్సీని ఐదు కోట్ల రూపాయిలకు కొనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయినా.. ఇంకా తాను సచ్ఛీలుడు వలే చంద్రబాబు ఫోజులిస్తున్నారని అంబటి విమర్శించారు. జగన్ కు సైకో లక్షణాలను ఉన్నాయని  ఓ పత్రికలో ప్రచురించడాన్ని అంబటి ఖండించారు. తాను అనుకున్నదే జరగాలనుకునే వాడే సైకో అని ఆ పత్రిక పేర్కొనడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. అసలు సైకో అంటే అర్థం ముందు తెలుసుకోవాలని అంబటి సూచించారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తిని మాత్రమే సైకో అంటారని.. వైఎస్ జగన్ వాస్తవ పరిస్థితులకు ఎక్కడ విరుద్ధంగా ప్రవర్తించారని అంబటి నిలదీశారు.


 


అంబటి ఇంకా ఏమన్నారంటే...


 


*వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే వారినే మాత్రమే సైకోలంటారు.

*ఎప్పుడు మాట్లాడిన చేతి వేలును చూపించే చంద్రబాబు, బోండా ఉమా, అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ లు సైకోలు

*హైదరాబాద్ ను నేనే నిర్మించా.. దేశానికి సెల్ ఫోన్ తీసుకొచ్చా.. ప్రపంచానికి ఐటీని పరిచయం చేశా? అనే చంద్రబాబు సైకో కాదా?

*ఇటీవల జపాన్ కు వెళ్లిన చంద్రబాబు అక్కడ జనం లేక బాధపడుతున్న ఆ దేశాన్ని చూసి... అత్యధిక జనాభా కల్గిన మన దేశంలో ఎక్కువమంది పిల్లల్ని కనాలని అంటున్నారు. ఇది ఏ లక్షణం?, సైకో లక్షణం కాదా?

*మానసిక స్థితి సరిగా లేని లక్షణాలు మీ కుటుంబాలో ఉన్నాయే తప్పా.. వైఎస్ జగన్ కుటుంబంలో లేవు

*జగన్ పై ఉన్న కేసులు కోర్టు విచారణలో ఉన్నా మీరు బహిరంగంగా విమర్శిస్తే తప్పులేదా?..   ఓటుకు కోట్లు గురించి సభలో మాట్లాడితే అది కోర్టు పరిధిలో ఉందంటారా?

*నీవు ఎంత నిప్పులాంటి మనిషివో జనాలకి అర్థమైంది


*ప్రధాన ప్రతిపక్ష నాయుకుడిపై వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు సహించరు



*ఇప్పటికైనా మీ పద్ధతిని మార్చుకుని సక్రమైన మార్గంలో పయనించాలి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top