బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించాలి


మహబూబ్‌నగర్‌ క్రై ం: మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను తొందరగా గుర్తించడం చాలా అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగారాం సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రస్తుత వాతావారణం, ఆహార అలవాట్ల కారణంగా మహిళలో రొమ్ము(బ్రెస్ట్‌) క్యాన్సర్‌ అధికంగా వస్తుందని చెప్పారు. పాలమూరు జిల్లాలో మహిళలకు ఈ క్యాన్సర్‌పై ఏమాత్రం అవగాహన లేదని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది తొలిదశలో గుర్తించి చికిత్స చేస్తే ప్రమాదం ఉండదని సూచించారు. గ్రామీణ మహిళలకు ఈ వ్యాధిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేసి చైతన్యం తీసుకురావాలని కోరారు. అనంతరం ఎంఎన్‌జే ఆంకాలజీ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చిన సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ ఎంతోమంది మహిళలు ఈ రకం లక్షణాలు ఉన్న కూడా గుర్తించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని తెలిపారు. గ్రామీణప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో బ్రెస్ట్‌క్యాన్సర్‌ అధికంగా ఉందని చెప్పారు. జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా దీనిపై అవగహన వస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ హరీశ్‌చంద్రారెడ్డి, డీఐఓ డాక్టర్‌ కృష్ణ, మల్లిఖార్జునప్ప, రవిశంకర్, రామాంజనేయులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top