వచ్చేవారం అగ్రి గోల్డ్ విచారణ


హైదరాబాద్: అగ్రి గోల్డ్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా చేసిన అరెస్టులపై అఫిడవిట్ దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. కాగా అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి వేసిన కమిటీ సాయంత్రం హైదరాబాద్లో సమావేశమవుతామని తెలిపింది. మరోపక్క, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే, అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లకు 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఏలూరు మెజిస్ర్టేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలసిందే.



 సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరు కోర్టులో వారిని హాజరుపరిచారు. వీరిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని వైద్య పరీకల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బాధితులు ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గురువారం రాత్రి వీరిని అరెస్టు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పలు జిల్లాల్లో బాధితులు పోలీసు స్టేషన్‌లలో కేసులు పెట్టారు. దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top