రా... రా శ్రీమంతుడా

రా... రా శ్రీమంతుడా - Sakshi


ఎక్కడి సమస్యలు అక్కడే    

గ్రామాల వైపు కన్నెత్తి చూడని వైనం

ఆదర్శంగా తీర్చి దిద్దుతామని హామీలతో సరి

దత్తత గ్రామాల వైపు కన్నెత్తి చూడని శ్రీమంతులు


 

దాతలు వచ్చారు.. మా కష్టాలు తీరుస్తారు.. కన్నీళ్లు తుడుస్తారు.. మా ఊరి దిశ, దశ మారుస్తారు.. ఇక పల్లె ప్రగతి బాట పడుతుంది.. అని గ్రామీణ ప్రజలు భావించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. పురం అభివృద్ధి పథంలో నడవడం మాట అటుంచితే కనీస వసతులు కల్పిస్తే చాలన్న పరిస్థితులు నెలకొన్నాయి పలు దత్తత గ్రామాల్లో. 


రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశామ్రిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, శ్రీమంతులు ముందుకు వచ్చి పలు పల్లెటూళ్లను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారు. అదన్నారు.. ఇదన్నారు.. ఏదీ లేదాయె. చివరకు పల్లెవాసి అభ్యున్నతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. అయినా వారు నేటికీ రారా శ్రీమంతుడా.. అని ఎదురు చూస్తున్నారు.

 

 మాటిచ్చారు.. మరిచారు


మదనపల్లె: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ గొప్పల కోసం కొందరు శ్రీమంతులు మాట ఇచ్చారు. ఆ తరువాత మరిచారు.   చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈశ్వరమ్మకాలనీ, రంగారెడ్డి కాలనీల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు.


అయితే ఇచ్చిన మాట ప్రకారం కొంత కాలం పోలీసుల పహారా, విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచారు. గ్రామంలో 15 మంది సీపీవోలను ఎంపిక చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఇవి తప్పా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు.  

 

కాప్పల్లెలో కానరాని ప్రగతి

రామసముద్రం మండలం కాప్పల్లె పంచాయతీని నాయకుడు హనమంతుశాస్త్రి దత్తత తీసుకున్నారు. ఏడాది క్రితం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు పరచకుండా ముఖం చాటేశా రు. ఫలితంగా ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోక పోతోంది. నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లెను టీడీపీ నాయకులు ఆర్‌జే వెంకటేష్ ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు.


కనీసం నీటి కొళాయిలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఇందు కు నిదర్శనమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఆచార్లపల్లెతోపాటు తవళం గ్రామాన్ని భాస్కర్‌నాయుడు దత్తత తీసుకుని తవళం నేలమల్లేశ్వర ఆలయం వరకూ రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటించారు. ఇంతకు మించి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో నాయకులు ఇచ్చిన హామీలు ఉత్తుత్తిగా మిగిలిపోయాయి.

 

ముఖం చాటేశారు

శ్రీకాళహస్తి రూరల్: ‘మేలచ్చూరు గ్రావుం. కొండ కింద ఒదిగిన ఓ గిరి జన ఆవాసం. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా విసిరేసిన పల్లె అది. అక్కడున్న 150 కుటుంబాల్లోని ప్రజల బతుకులు రెక్కాడితే గానీ డొక్కాడని దీనస్థితి. అరుుతే ప్రధాని మోడీ పిలుపు అందుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాసులు గ్రావూన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఏడాది కిందట హామీ ఇచ్చారు.


దీంతో మేలచ్చూరు వాసులు శ్రీవుంతుడు సినివూలో చూపినట్లు తమ గ్రామం బాగుపడిపోతుందని సంబరపడిపోయూరు. అయితే వారి ఆశలు రోజులు గడిచేకొద్దీ అడియూశలయ్యూరుు. వూటిచ్చిన పెద్ద వునిషి గ్రావూభివృద్ధి సంగతి అటుంచితే.. కనీసం గ్రావుం వైపు ఇప్పటివరకు కన్నెతి చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారీ గిరిపుత్రులు. ఒక్క మేలచ్చూరు పరిస్థితే కాదు... వుండలంలోని దత్తత గ్రావూలన్నింటిలోనూ పరిస్థితి దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.’

 

శ్రీకాళహస్తి వుండలంలోని చల్లపాళెం పంచాయుతీని వేవుూరు వుునిచంద్రారెడ్డి, ఊరందూరు శ్రీరామ్, ఎగువవీధి చేవుూరు రమేష్, యూసారపు అనంతకువూర్, కుంటిపూడి రేవిళ్ల నిరంజన్‌బాబు, కలవగుంట రుద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారావు, గంగలపూడి శ్రీనివాసులునాయుుడు, బీవీ పురం డాక్టర్ రమేష్, మేలచ్చూరు శ్రీనివాసులు, వుుచ్చువోలు పృధ్విరాజ్, జలగం రాజేష్ దత్తతకు తీసుకున్నారు. అరుుతే వారు ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో ఎలాంటి పనులు చేయుకపోగా,  ఆ ఊళ్ల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానికులు తెలిపారు.  

 

 గట్టు దాటని గడ్డూరు

బెరైడ్డిపల్లె: వుండలంలోని గడ్డూరు పంచాయతీని కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన టీడీపీ కోరం అనే సంస్థ ఏడాది క్రితం దత్తత తీసుకుంది. పంచాయతీని అభివృద్ధి చేస్తావుని గొప్పలు చెప్పింది. అయితే ఈ గ్రామం వైపు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. దీంతో ఆ పంచాయతీలో సవుస్యలు విలయతాండవం చేస్తున్నాయి. సువూరు 300 కుటుంబాలున్న ఈ గ్రామంలో వీధి దీపాలు సైతం వెలగక పోవడంతో అంధకారం నెలకొంది. డ్రైనేజీ వ్యవస్త దెబ్బతినడంతో వుురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తోంది. కొన్ని వీధుల్లో మురుగు కాలువలు, సిమెంటు రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రావుంలో వీధి కొళాయిలు ఏర్పాటు చేయుక పోవడంతో ఊర్లో ఉన్న నీటితొట్టెల్లోని నీటిని తీసుకువెళ్లి, తాగాల్సిన దుస్థితి నెలకొంది.

 

అభివృద్ధి జాడ లేదు  

 అధికారులు, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి మాట ఎప్పుడో మరిచారు. కనీసం దత్తత తీసుకున్న దాతలైనా మా పంచాయతీ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాగా ఉంది. తాగునీటి కోసం వుహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇలాంటి దుస్థితి ఏ గ్రావూనికి రాకూడదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.

 -వినోద్‌కువూర్, గడ్డూరు

 

 మా తలరాతలు మారలే!

 తవు కాలనీలో నెలకొన్న సవుస్యలను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. దాతలైనా బాగుపరస్తారనుకున్నాం. వారు మాట ఇచ్చి మరిచారు. కాలం వూరుతున్నా వూ తలరాతలు వూరడం లేదు. ఇప్పటికీ చేతిపంపులో నీరే వాడుకుంటున్నాం.

                                   -రావుచంద్రప్ప, గడ్డూరు

 

 

 అభివృద్ధిని విస్మరించారు!

 రామకుప్పం: వుండలంలోని ఆరివూనిపెంట, కొంగనపల్లె, చెల్దిగానిపల్లె గ్రావూలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన దాతలు ఆ గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. గ్రావూలను ప్రగతి పథంలో నడపడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలేదు. దీంతో గ్రావు ప్రజలు తీవ్ర నిరాశతో కుమిలి పోతున్నారు. ఆరిమానిపెంట గ్రావూన్ని దత్తత తీసుకున్న డీఎఫ్‌వో చక్రపాణిరెడ్డి గ్రామ ఛాయలకు కూడా రాలేక పోయారు. దీంతో గ్రామంలో నిరుద్యోగ సమస్య, సీసీ రోడ్లు సమస్య తదితర సమస్యలు పరిష్కారం గ్రామస్తులకు కలగానే మిగిలింది. సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొంగనపల్లెని చిన్నకృష్ణ, చెల్దిగానిపల్లెని ఉమాపతి దత్తత తీసుకున్నారేగానీ అభివృద్ధి విషయుంలో ఏ మాత్రం పురోగతి సాధించలేక పోయారు.

 

బృందమ్మా.. బంధమేదీ?

తొట్టంబేడు: అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ తీసుకున్న దత్తత గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆ గ్రామాలను గురించి ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆ పల్లెల్లో ప్రగతి పడకేసింది. మండలంలోని కొన్నలి, బోనుపల్లి గ్రామాలను మంత్రి సతీమణి బృందమ్మ దత్తత తీసుకున్నారు. అనంతరం వాటిని గురించి మరిచారు. దీంతో కొన్నలిలో రోడ్లు అధాన్నంగా ఉన్నాయి. మురుగునీటి కాలువలు, వీధిదీపాలు లేవు. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. గ్రావుంలోని  అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకంగా మార్చి తాగునీటిని విక్రయిస్తున్నా రు. ఇంతవరకు బృందవ్ము ఒక్క రూపాయి సొంత నిధులను ఆ గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవు. బోనుపల్లి అభివృద్ధి కోసం రూ.10 కోట్లు నిధులు నిధులు వచ్చాయని బృందమ్మ చెప్పినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వారే రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను ఉపయోగించి అరకొర పనులను చేపట్టి ఆ పనులు సొంత నిధులతో చేసినట్లు చెప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

 

 

 బోసన్నా.. ఆ గ్రామాన్ని చూడన్నా!

 పలమనేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు పలమనేరు మండలంలోని సముద్రపల్లె గ్రామాన్ని స్థానిక టీడీపీ నాయకుడు సుభాష్‌చంద్రబోస్ ఏడాది కిందట దత్తత తీసుకున్నారు. ఆ మేరకు కలెక్టర్ ఇచ్చిన శిక్షణ తరగతులకు సైతం హాజరయ్యారు. ఆపై గ్రామంలో తను సొంతంగా చేసిన అభివృద్ధి పనులు ఇంకా మొదలు కాలేదు. కేవలం ప్రభుత్వం నుంచీ అందే అరాకొర నిధులు తప్పా దాత నుంచి గ్రామానికి ఒరిగిందేమీ లేదు. దీంతో గ్రామస్తులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు.




గ్రామానికి దారి కూడా మూసేశారు

 సుమారు 160 గడపలున్న ఈ గ్రామానికి దారిదే అసలు సమస్య. గ్రామంలోని ఓ పెద్దమనిషి తన భూమంటూ దారిని మూసేశాడు. దీంతో గ్రామంలోని పాఠశాలకు, అంగన్‌వాడీ కేంద్రానికి, పంచాయతీ భవనానికి దారి లేకుండా పోయింది. ఇక తావడపల్లె మీదుగా పలమనేరుకు, రైతుల పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య కొన్నాళ్లుగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో తమ గ్రామంలో నెలకొన్న దారి సమస్యను కనీసం అధికారపార్టీ నాయకుడు, గ్రామాన్ని దత్తత తీసుకున్న దాత అయిన బోస్ పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




 సమస్యల సంద్రం..

 గతంలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన సముద్రపల్లె సమస్యల సంద్రంగా మారింది. పలుచోట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పలు వీధులు ఆక్రమణలకు గురై కుచించుకుపోయాయి. గ్రామంలోని రోడ్ల పక్కన పేడదిబ్బలు దర్శమిస్తున్నాయి. పారిశుద్ధ్యం లోపించింది. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

 

 అభివృద్ధి జరగాలి

 మా గ్రామంలో పలు వీధులకు సీసీ రోడ్లు లేవు. ముఖ్యంగా వీధి దీపాలు వెలగక రాత్రి సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లపైనే విద్యుత్ తీగలు ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక డ్రైనేజీలు దెబ్బతిని కాలువనీళ్లన్నీ ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతాయి. బోసన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మాసమస్యలను తీరిస్తే సంతోషిస్తాం.

 -స్వతంత్రబాబు, నూనేవారిపల్లె

 

 అన్న తరచూ వస్తూనే ఉన్నారు

 గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న విషయం గురించి ఎంపీడీవో దాతకు బోస్‌కు చెప్పాల్సి ఉంది. కానీ మెడమ్ ఈ విషయాన్ని మరి చినట్టున్నారు. ముఖ్యంగా గ్రామంలో దారి సమస్య ఉంది. దీన్ని త్వరగా పరిష్కారం చేయాలి. ఈ మధ్యనే ప్రభుత్వం నుంచి నిధులందాయి. దాంతో సీసీ రోడ్లు కొంత వేయిస్తున్నాం.

 -విజయ్‌కుమార్, సర్పంచ్, సముద్రపల్లె

 

 ప్రకటనలకే పరిమితం

 పీలేరు: కనీస వసతులకు నోచుకోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు గ్రామాలను దాతలు దత్తత తీసుకున్నారు. ఈ తంతు ప్రారంభమై ఏడాది కాలం దాటుతున్నా దాతలు ఎవరూ తాము దత్తత తీసుకున్న గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పీలేరు మండలంలో 20 గ్రామాలను దాతలు దత్తత తీసుకున్నారు.  ఆమూరి నాగరాజ అనే దాత ఒక్కరే 14 గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాగే వీరబోయని రెడ్డిప్రసాద్, దొడ్డిపల్లె గ్రామాన్ని, జె. మోహన్‌రాజు యర్రగుంట్లపల్లెను, శ్రీనివాసులు ముడుపులవేములను, ఎం. రవిప్రకాష్ వేపులబైలును, రాజశేఖర్‌రాజు, చరణ్‌రెడ్డి పీలేరును దత్తతు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖ లాలు లేవు.

 

 కేవీపల్లె మండలంలో...

 కేవీపల్లె మండల అభివృద్ధి అధికారి రామచంద్ర సొంత గ్రామమైన మఠంపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. 80 కుటుంబాలు ఉన్న గ్రామంలో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వీధి దీపాలు కూడా లేవు. పక్కా గృహాలు మంజూరు కాకపోవడంతో ఇప్పటికీ సుమారు పది కుటుంబాల వారు పూరి గుడిసెల్లో కాపురం ఉంటున్నారు. గ్రామంలో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. తాను దత్తత తీసుకున్న మఠంపల్లె గ్రామంలోని సమస్యలపై సర్వే చేపడుతున్నట్లు ఎంపీడీవో రామచంద్ర తెలిపారు.

 

 గుర్రంకొండ మండలంలో...

 సాక్ష్యాత్తు  జిల్లా ఎస్పీ ఘట్టవునేని శ్రీనివాస్ దత్తత తీసుకొన్న సంగసముద్రం గ్రామం ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామానికి మినరల్ వాటర్‌ప్లాంట్, కల్యాణమండపం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు మరిన్ని హామీలు ఇచ్చారు. హామీల్లో వాటర్‌ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేశారు. అంతటితో సరిపెట్టుకుని మిగిలిన హామీలు నెరవేర్చలేదు.




 కలికిరి మండలంలో....

 కలికిరి మండలంలో మెరవకిందపల్లెపంచాయతీ ఎంపీడీవో ఇందిరమ్మ  ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. అలాగే టి.చండ్రావారిపల్లె పంచాయతీని హౌసింగ్ ఏఈ వెంకటరెడ్డి దత్తత తీసుకున్నారు. మొదట్లో కొంతకాలం గ్రామాల్లో పర్యటించి హడావిడి చేశారు. అనంతరం దత్తత గ్రామాల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు.  

 

 కలకడ మండలంలో...

 మండలంలోని నడిమిచెర్ల, కోన, గుడిబండ పంచాయతీలను నాగరాజ దత్తతు తీసుకున్నారు. బాలయ్యగారిపల్లె, కలకడ, బాటవారిపల్లెను శేఖర్, గంగాపురం, కే.దొడ్డిపల్లె, దేవలపల్లె పంచాయతీలను మద్దిపట్ల వెంకట్రమణ, ఎర్రకోటపల్లె, నవాబుపేట, ముడియంవారిపల్లె శంకర్‌నాయుడు, ఎనుగొండపాళెం, కదిరాయచెరువులను శ్రీనివాసులునాయుడు దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు.

 

 

సర్వేలతోనే సరి

పెద్దతిప్పసముద్రం/బి.కొత్తకోట: తంబళ్లపల్లెని యోజకవర్గంలో దత్తత గ్రామాల్లో అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. తరువాత వాటి గురించి దాతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో పెద్దమండ్యం మండలం మిన హా మిగిలిన ఐదు మండలాల్లోని 30 పంచాయతీ లను శ్రీమంతులు దత్తత తీసుకున్నారు.  దత్త త గ్రామాల వివరాలను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో నమోదు చేశారు. దీంతో ఆయా మండలాల్లోని అధికారులు దత్తత తీసుకున్న  గ్రామాలకు వెళ్లి ప్రజలు ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, ఆర్థిక వనరులు, తక్షణం ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలపై సమగ్రంగా సర్వే నిర్వహించారు. ఆ తరువాత మిన్నకుండిపోయారు.

 

దత్తత గ్రామాల్లో పరిస్థితి ఇలా..

బి.కొత్తకోట మండలంలోని 11 పంచాయతీలను పలువురు దత్తత తీసుకున్నారు. సదరు శ్రీమంతులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన బి.కొత్తకోటను పోటీ పడి 10 మంది దత్తత తీసుకున్నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఓ కళాశాల యాజమాన్యం ఏడాదికి రూ.20 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఢంకా బజాయించినా ఫలితం శూన్యమని ప్రజలు ఆరోపిస్తున్నారు.


పెద్దతిప్పసముద్రం మండలంలో కందుకూరు, టీ సదుం, రంగసముద్రం, తుమ్మరకుంట, బూర్లపల్లి, ములకలచెరువు మండలంలో బురకాయలకోట, బీకువారిపల్లి, మద్దినాయునిపల్లి, వేపూరికోట, కాలువపల్లి, కదిరినాయునికోట, తంబపల్లి మండలంలోని  గుండ్లపల్లి, కొటాల, గోపిదిన్నె, ఎద్దులవారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి గ్రామాలను ఒకే వ్యక్తి దత్తత తీసుకున్నారు. కోటకొండ, తంబళ్లపల్లె గ్రామాలను మరో ఇద్దరు దత్తత తీసుకున్నారు. అయినా ఇంత వరకు దత్తత గ్రామాల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top