ఏసీబీకి చిక్కిన నరసాపురం ఆర్‌ఐ

ఏసీబీకి చిక్కిన నరసాపురం ఆర్‌ఐ - Sakshi

నరసాపురం : జనన ధ్రువీకరణ పత్రం కోసం రూ.ఐదువేలు లంచం డిమాండ్‌ చేసిన  నరసాపురం ఆర్‌ఐ జి.పెద్దిరాజును బుధవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతనిని అరెస్ట్‌చేసి విజయవాడకు తరలించారు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి చెందిన కొల్లాటి ఆనంద్‌ కుమార్‌ ఇటీవలే ఐటీఐ పూర్తి చేశాడు. అతను జనన ధ్రువీకరణ పత్రం కోసం యత్నించాడు. పుట్టినప్పుడు నమోదు చేయకపోవడంతో, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ద్వారా లేట్‌ బర్త్‌ç          సర్టిఫికెట్‌ కావాలంటూ దరఖాస్తు చేశాడు. నిబం««దlనల ప్రకారం, అన్ని సర్టిఫికెట్లు జతచేసి, తాను పుట్టిన నరసాపురం మండలం వేములదీవి నుంచి అక్టోబర్‌లో  మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే ఆర్‌ఐ పెద్దిరాజు దీనికోసం రూ.5వేలు డిమాండ్‌ చేశారు. అవి ఇస్తేనే కానీ పని జరగదని తిప్పించుకుంటున్నారు. దీంతో ఆనంద్‌కుమార్‌ ఏలూరులోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

 

కొత్త నోట్లతో దొరికిన ఆర్‌ఐ..

దీంతో ఏసీబీ విజయవాడ డీఎస్పీ గోపాలకృష్ణతోపాటు, రాజమండ్రి  డీఎస్పీ ఎం.సుధాకర్‌రావు సిబ్బందితో కలిసి వలపన్నారు. బుధవారం సాయంత్రం ఆనంంద్‌ కుమార్‌కు రెండు రూ.2వేల కొత్తనోట్లు, మరో పది రూ.100లు నోట్లు  ఇచ్చి పంపారు. తహసీల్దార్‌ కార్యాలయంలోని తన సీటు వద్దే ఆ సొమ్ము తీసుకుంటూ పెద్దిరాజు ప్రత్యక్షంగా దొరికినట్టు గోపాలకృష్ణ వివరించారు. ఆర్‌ఐపై చాలా ఫిర్యాదులున్నాయని చెప్పారు. పెండింగ్‌లో చాలా ధ్రువీకరణపత్రాలు ఉన్నాయని, వాటిపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆర్‌ఐ వల్ల ఇంకా ఎవరైనా  ఇబ్బందులు పడితే, తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఏసీబీ దాడి ఉద్యోగవర్గాల్లో కలవరం రేపింది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top