ప్రభుత్వ స్థలంపై కబ్జాకోరుల కన్ను

ప్రభుత్వ స్థలంపై కబ్జాకోరుల కన్ను - Sakshi


► రాత్రికి రాత్రే వెలసిన గుడిసెలు

► సకాలంలో స్పందించిన అధికారులు

► ఆక్రమణల తొలగింపు

► భూమి ఆక్రమిస్తే జైలుకే : తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌


తిరుపతి రూరల్‌ మండలంలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కబ్జా రాయుళ్లు బరితెగిస్తున్నారు. కోట్ల విలువైన భూముల్లో రాత్రికి రాత్రే గుడిసెలు వేసేస్తున్నారు. తుడా నిర్లక్ష్యంతో అన్యాక్రాంతమవుతున్న రూ.10 కోట్ల విలువైన భూమిని రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించడంతో కాపాడుకోగలిగారు.



తిరుపతి రూరల్‌: తిరుచానూరు పంచాయతీ సర్వే నంబర్‌ 234లో 100 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. అందులో 30 ఎకరాలను ప్రజా ప్రయోజనాల కోసం 2006లో తుడాకు కేటాయిం చారు. అక్కడ ఎకరా దాదాపు రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ పరిధిలోకి తీసుకోవటంలో చూపిన చొరవను దానిని కాపాడటంలో తుడా చూపలేకపోయింది. విలువైన ఈ స్థలంపై కబ్జారాయుళ్లు కన్ను వేశారు. రూ.10 కోట్ల విలువ చేసే రెండు ఎకరాల స్థలంలో గురువారం రాత్రి దాదాపు 30 గుడిసెలు వేసి, ఆక్రమించుకునేందుకు యత్నించారు.



సకాలంలో స్పందించిన తహసీల్దార్‌..

విలువైన తుడా భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్లు తిరుపతి రూరల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు స్థానికులు సమాచారం అందించారు. స్పం దించిన ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ ఇ¯ŒSస్పెక్టర్‌ శివకుమార్‌ను ఆదేశించారు. ఆక్రమణదారులు అడు్డకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి, తుడా అధికారులకు సమాచారం అందించారు.



కబ్జారాయుళ్లపై పోలీసులకు ఫిర్యాదు..

విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ పోలీసులను ఆదేశించారు. తహసీల్దార్‌ ఆదేశాలతో ఆర్‌ఐ శివకుమార్‌ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి జైలు తప్పదని తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అబ్బన్న, వీఆర్వో మల్లికారు్జనరెడ్డి, వీఆర్‌ఏ బాలకృష్ణ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top