ఇదీ జీ‘వనం’..!

ఇదీ జీ‘వనం’..!


సీతంపేట: అంతా హైటెక్‌. అన్నీ టెక్నాలజీతోనే. వేలి ముద్రలు, కంటి చూపుతో రేషను, పింఛన్లు ఇస్తున్న సర్కారుకు ఇక్కడి బతుకులు పట్టడం లేదు. నిత్యం సాంకేతిక మంత్రం జపిస్తున్న అధికార పార్టీ నాయకులను ఇక్కడి చావులు కూడా కదిలించడం లేదు. డిజిటల్‌ వ్యవస్థ విశ్వరూపం చూపిస్తున్న పరిస్థితుల్లో జిల్లాలోని 300 ఏజెన్సీ గ్రామాలు కనీసం ఫోన్‌ కాల్‌కు నోచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పది నుంచి 20 కిలోమీటర్ల దూరం వచ్చి ప్రయత్నిస్తే గానీ 108కు సమాచారం అందించలేరంటే నమ్మాల్సిందే.



సీతంపేట చుట్టుపక్కల..

సీతంపేట ఏజెన్సీలో సుమారు 24 పంచాయతీల్లో 500కుపైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 300 గ్రామాల ప్రజలు నిత్యం బతుకు యుద్ధం చేస్తున్నారు. దాదాపు సగం గ్రామాల్లో పూర్తిగా నెట్‌వర్క్‌ సేవలు లేవు. సెల్‌ఫోన్‌ వంటి సౌకర్యం లేకపోవడంతో దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులు, మైదాన ప్రాంతాల్లో చదువుతున్న తమ పిల్ల లతో మాట్లాడడానికి గిరిజనులకు వీల్లేకుండా పోతోంది. అత్యవసర సమయాల్లో గర్భిణు లు, రోగులను సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు తదితర ప్రాంతాల ఆస్పత్రులకు

తరలించాలన్నా ఇబ్బందే. నెట్‌వర్క్‌ లేకపోవడంతో 108కు కూడా వీరు ఫోన్‌ చేయలేకపోతున్నారు. రాత్రిపూట ఎక్కడో సిగ్నల్‌ ఉన్న ప్రాం తానికి వచ్చి ఫోన్‌ చేయాల్సి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు.



ఈ లోగా ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. పింఛన్‌దారుల పాట్లు అయితే వర్ణాణాతీతం, వికలాంగులు, వృద్ధు లు, వితంతువుల వేలి ముద్రలు పడాలి.. కానీ నెట్‌వర్క్‌ పనిచేయక వీరికి ప్రతి నెలా ఇబ్బం దులు తప్పడం లేదు. 20 నుంచి 25 కిలో మీటర్ల దూరంలో నెట్‌వర్క్‌ ఉన్న చోటకు కొండలపై నడుచుకుంటూ వచ్చి పింఛన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మైదాన ప్రాంతాలకు రావాలంటే పల్లెవెలుగు బస్సుల సౌకర్యం అరకొరగా ఉండడంతో ప్రైవేటు వాహనాలపైనే గిరిజనులు ఆధారపడుతున్నారు.



కమ్యూనికేషన్‌ కరువు

మండలంలోని దోనుబాయి, పుబ్బాడ, దారపాడు, సామరెల్లి, పుబ్బాడ, కిల్లాడ, కుడ్డపల్లి, టిటుకుపాయి పంచాయితీల పరిధిలో పూర్తిగా కమ్యూనికేషన్‌ లేదు. దోనుబాయిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్‌ ఉన్నా సాంకేతిక పరమైన లో పాలు ఉండడంతో టవర్‌ను ప్రారంభించలేదు. పూతికవలస, కొండాడ, శంబాం, హడ్డుబంగి, కోడిశ, కుశిమి, పులిపుట్టి, హడ్డుబంగి పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాల్లో అరకొర సమాచార వ్యవస్థతో ప్రజలు నెట్టుకొస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కళావతి ఎంత కృషి చేస్తున్నా సర్కారు సహకారం లేకపోవడంతో వీరి బతుకులు బాగు పడడం లేదు.



ఈ గ్రామాల్లో కనీసం బ్యాంకులు అందుబాటులో లేవు. మహిళా సంఘాలు, రైతులు, ఇతరులు బ్యాంకు పనిమీద సీతంపేటకు రావాల్సిందే. గతంలో దోనుబాయిలో ఆంధ్రాబ్యాం కు ఉండేది. దాన్ని ఎత్తివేశారు. బ్యాంకు పనుల కోసం సీతంపేటలో ఉన్న బ్యాంకులకు రావాల్సి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు.  దోనుబాయి, పొల్ల ప్రాంతంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే సమస్యలు తీరుతాయని కోరుతున్నారు.



పట్టించుకోవడం లేదు

ఇన్ని సమస్యలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ముం దుగా కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేస్తే బా గుంటుంది. ఎక్కడకు వెళ్లాలన్నా రవాణా వ్యవస్థ కూడా అరకొరగా ఉంది. మా పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.

– గేదెల కోటేశ్వరరావు,

దోనుబాయి సర్పంచ్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top