'దగ్గరుండి 29మంది ప్రాణాలు తీశారు'

'దగ్గరుండి 29మంది ప్రాణాలు తీశారు' - Sakshi


హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి గోదావరి పుష్కర ఘాట్ వద్ద 29మంది ప్రాణాలు తీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సామాన్యుల పుష్కర ఘాట్ వద్దకు వచ్చి సెలబ్రిటీల వ్యవహరించారని అన్నారు. సోమవారం శాసనభలో చంద్రబాబునాయుడు పుష్కర ఘాట్ మరణాలకు సంబంధించి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన  అనంతరం ఆయన మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని అన్నారు.



 వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సరస్వతీ ఘాట్ వద్దకు వెళ్లి స్నానం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, అంతమంది ప్రాణాలు పోయేవి కావని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం షూటింగ్ ఏర్పాట్లు చేసుకొని చక్కగా మేకప్ వేసుకొని హీరోగా కనిపించాలని అక్కడికి వచ్చి విషాదం సృష్టించారని చెప్పారు. (ఈ సమయంలో వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు). అనంతరం మరోసారి వైఎస్ జగన్ ఏమన్నారంటే..


*ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడల్లా మైక్ కట్ చేస్తారు

* మా వాళ్లకు మైకులివ్వరు

* మనిషిని పొడిచి.. వాళ్లంతటే వాళ్లే దండేసి నివాళులర్పించే పరిస్థితిలోకి సభను తీసుకెళ్తున్నారు

* చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తే అది శాసనసభమీద ఆరోపణలు చేసినట్లుగా చెప్తున్నారు

* శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలను ఏబీఎన్ కు అప్పగించారు

* పచ్చచొక్కాలు వేసుకునే వాళ్లు తప్ప మైకులు పనిచేయవు, టీవీలు కనిపించవు

* పుష్కరాల్లో చనిపోయినవారి గురించిన బాధకంటే వారెలా చనిపోయారో చెప్తుంటే ప్రభుత్వానికి ఇబ్బందికలుగుతోంది

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top