జిల్లాలో 168 మి.మీ. వర్షపాతం నమోదు


 


జిల్లాలో 168 మి.మీ. వర్షపాతం నమోదు 

ఏలూరు (సెంట్రల్‌) : జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సగటు వర్షపాతం 3.5 మిల్లీమీటర్లు నమోదైంది. అత్యధికంగా నరసాపురం మండలంలో 11.2 వర్షపాతం నమోదు కాగా కుక్కునూరు 9, ఆకివీడు, వీరవాసరంలలో 8.6, నిడమర్రు, యలమంచిలి 8.4, పోడూరు 8, భీమవరం, పాలకొల్లులో 7.4, ఉండి, పెనుగొండ, ఆచంటలలో 7.2, ఉంగుటూరు 6.8, కాళ్ల, పాలకోడేరులలో 6.6, అత్తిలి 5.4, ఇరగవరం 5.2, గణపవరం, పెనుమంట్రలలో 4.8, మొగల్తూరు 4.2, పెంటపాడు, తణుకులలో 3.6, పెరవలి 3.4, తాడేపల్లిగూడెం 3, ఉండ్రాజవరం 2.6, తాళ్లపూడి, పెదవేగిలలో 1.8, నిడదవోలు 1.6, చాగల్లు 1.4, బుట్టాయిగూడెం 1.2, కొవ్వూరు 1 మిల్లీమీటర్లు చొప్పున నమోదైంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top