ధర్మవరంలో 144 సెక‌్షన్‌


ధర్మవరం అర్బన్ :  పట్టణంలో పది రోజులపాటు 144 సెక‌్షన్‌తోపాటు 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నామని సీఐ హరినాథ్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. డీఎస్పీ వేణుగోపాల్‌ ఆదేశాల మేరకు పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక‌్షన్‌, 30 పోలీస్‌యాక్ట్‌ అమలు చేస్తున్నామని తెలిపారు.



రోడ్లమీద గుంపులు గుంపులుగా ఉండరాదని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. అత్యవసరమైతే పోలీస్‌ అనుమతి తీసుకోవాలని సూచించారు. లాడ్జీలు, కళ్యాణమండపాలు, ఆలయాల్లో సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. వీటిని ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top