12 అడుగుల కింగ్కోబ్రా కలకలం



పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్ననీలావతి రైల్వేగేటు సమీపంలో 12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి రైల్వేగేట్ క్యాబిన్ లోకి దూరిన ఈ నల్లతాచు.. రాత్రంతా బుసలు కొట్టి గేట్‌మన్ ప్రసాద్ ను భయాందోళనకు గురిచేంది.


 


మంగళవారం తెల్లవారిన తర్వాన సమాచారం తెలుసుకున్న నీలావతి గ్రామస్తులు రైల్వే గేట్ వద్దకు చేరుకుని భయంకర సర్పాన్ని చంపేశారు. 12 అడుగుల పొడవు ఉన్న ఈ కింగ్ కోబ్రా అరుదైన పాముగా గుర్తించారు. గత ఏడాది కూడా ఇలాంటి పామే ఒకటి కనిపించిందని గ్రామస్తులు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top