10 కిలోల గంజాయి స్వాధీనం
కడప అర్బన్ :
అమరావతి నుంచి వచ్చిన ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం, కడప ఎక్సైజ్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఈనెల 23న ఖాజీపేట మండలంలో చిన్న సుబ్బరాయుడు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. దువ్వూరు మండలం కృష్ణంపల్లెకు చెందిన చిన్న సుబ్బరాయుడు 10 కిలోల గంజాయిని సంచిలో పెట్టుకుని, ద్విచక్రవాహనంలో కడప వైపు వస్తుండగా అరెస్ట్ చేశారు. గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమరావతి నుంచి వచ్చిన బృందంలో శ్యాం సుందర్, నరేందర్ రెడ్డి, కృష్ణమూర్తి, లోకేష్, కడపకు చెందిన కిషోర్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు కానిస్టేబుల్ బాలరంగయ్య తదితరులు ఉన్నారు.