'ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి దీని కోసం ఆర్థికంగా ఎదగాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలువరంగల్

వరంగల్

 • ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌ August 27, 2016 01:01 (IST)
  హన్మకొండలోని డీఈవో కార్యాలయం పక్కనే ఉన్న సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత భవనాన్ని కూల్చే క్రమంలో ఓ గది గోడ తొలగించగా ఐరన్‌ లాకర్‌ బాక్స్‌(త్రిజోరి) బయటపడిం ది. అయితే, రెండు రోజుల క్రితం ఇది బయటపడినా శుక్రవారం విషయం వెలుగుచూసింది.

 • దొంగనోట్ల కలకలం August 27, 2016 00:55 (IST)
  మండలంలోని చెల్పూరు గ్రామం లో 1000 రూపాయల దొంగనోట్లు కలకలం సృష్టించా యి. భూపాలపల్లి మండలం మో రంచపల్లి గ్రామ∙శివారు దుబ్బపల్లికి చెందిన రైతు బొజ్జ లచ్చయ్య స్థానిక చెల్పూరు గ్రామీ ణ వికాస బ్యాంక్‌లో బుధవారం రూ.13 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. బ్యాంకు క్యాషియర్‌ అన్ని వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చాడు.

 • అభ్యంతరాలు లక్షల్లో పంపాలి August 27, 2016 00:55 (IST)
  యాదాద్రి జిల్లా వద్దు.. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో అభ్యంతరాలు పంపాలని జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్, పూలే అధ్యయన కేంద్రంలో శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 • రూపురేఖలు ఇవే August 27, 2016 00:52 (IST)
  జిల్లాల పునర్విభజన అంశాల్లో నెలకొన్న సందేహాలకు కొంత స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్‌ జిల్లాకు భూపాలపల్లి పరిపాలన కేంద్రం కానుంది. వరంగల్‌ జిల్లాకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్‌ మండల ప్రాంతం కేంద్రం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

 • చోరీ కేసు నిందితుడి ఆత్మహత్యాయత్నం August 27, 2016 00:52 (IST)
  దొంగతనం కేసులో పోలీసులు కొడతారనే భయంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని సీరోలు గ్రామంలో శుక్రవారం జరి గింది. పోలీసులు, నిందితుడి భార్య మల్లమ్మ, కుమారుడు ఉపేందర్‌ కథనం ప్రకారం.. సీరోలు గ్రామానికి చెందిన బోనాల రాంమూర్తి 24వ తేదీన కోళ్లు దొంగిలించాడంటూ అదే గ్రామానికి చెందిన ఈర్ల మైసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 • చారిత్రక నగరాన్ని విడదీయెుద్దు August 27, 2016 00:48 (IST)
  చారిత్రక ఓరుగల్లు నగరాన్ని విభజించొద్దని.. హన్మకొండను జిల్లా చేసే ప్రతిపాదన విరమించుకోవాలని, జనగామ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. హన్మకొం డ నక్కలగుట్టలోని హోటల్‌ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం అఖిలపక్ష కమిటీ సమావేశం జరిగింది.

 • రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలి మృతి August 27, 2016 00:47 (IST)
  రైలు ఢీకొని గుర్తుతెలి యని వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మానుకోట రైల్వేస్టేçÙన్‌ సమీపంలో శుక్రవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధురాలు మానుకోట రైల్వేస్టేçÙన్‌ సమీపంలో ఆగిఉన్న గూడ్సు రైలు నుంచి కింది నుంచి పట్టాలుదాటి, ఆ తర్వాత లూప్‌లైన్‌ దాటుతుండగా అదే సమయంలో ముంబై నుంచి భువనేశ్వర్‌ వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌(డౌన్‌లైన్‌లో) రైలు ఆ వృద్ధురాలిని ఢీకొట్టి

 • కంచనపల్లిని మండలం చేయాలి August 27, 2016 00:45 (IST)
  మండలంలోని కంచనపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం కలెక్టర్‌ వాకాటి కరుణ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భూ పరిపాలన శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రేమండ్‌ పీటర్‌లకుS గ్రామస్తులు వినతి పత్రం అందించారు. హన్మకొండలో కలెక్టర్‌ను, హైదరాబాద్‌లో కడియం శ్రీహరి, రేమండ్‌ పీటర్‌లను కలిశారు.

 • మండలాల కోసం లొల్లి August 27, 2016 00:42 (IST)
  మానుకోట జిల్లా కోసం తీవ్రస్థాయిలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ముసాయిదా లో మానుకోట పేరు ప్రకటించగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ పలు గ్రామాల ను మండలాలు చేయాలని, రెవెన్యూ డివిజన్లు చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.

 • సి‘ఫార్స్‌’ నియామకం August 27, 2016 00:41 (IST)
  గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉద్యోగుల పోస్టుంగ్‌లలోనే కాదు పనితీరు వ్యవహరంలోనూ రాజకీయ జోక్యం పెరిగింది. ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారికి మంచి పోస్టులు ఇవ్వాలని గ్రేటర్‌ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పనితీరు బాగా లేని వారిని పక్కన పెట్టారు. ఇలా పనితీరు ప్రమాణికంగా పక్కన పెట్టిన ఓ ఉద్యోగి రాజకీయ బలంతో మళ్లీ కీలకమైన పోస్టులోకి వచ్చారు.

 • త్వరలో తహసీల్దార్ల బదిలీలు ! August 27, 2016 00:40 (IST)
  జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలు జరుగనున్నట్లు సమాచారం. ఒకరిద్దరు కాదు.. ఏకంగా అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిల్లోనూ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈసారి బదిలీల్లో రాజకీయ జోక్యం లే కుండా పూర్తిగా శాఖాపరంగానే చేపట్టాలని ఉ న్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం.

 • ట్రాక్టర్‌ బోల్తాపడి హమాలీ మృతి August 27, 2016 00:37 (IST)
  మార్కెట్‌కు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని ధన్నసరి శివారు సబ్‌స్టేçÙన్‌తండా సమీపంలో శుక్రవారం జరిగింది. బంధువుల కథనం ప్రకా రం... మానుకోట మండలం ఇంద్రానగర్‌కి చెందిన దారావత్‌ అమర్‌సింగ్‌(48) కేసముద్రంలోని ఓ ఇండస్ట్రీస్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు.

 • విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి August 27, 2016 00:36 (IST)
  వి ద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకతను వెలికి తీస్తూ సైన్స్‌పట్ల అవగాహన పెం పొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రాజీవ్‌ సూచించారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జనగామ డివిజన్‌ స్థాయి ఇన్‌సె్పౖర్‌ ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీఈఓ ఎస్‌.యాదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. ప్రతివిద్యార్థి సాంకేతికనిపుణుడిగా తయారై కొత్త అధ్యయనాలు

 • మద్దూరులో పురాతన విగ్రహాలు August 27, 2016 00:35 (IST)
  మద్దూరు మండలం బెక్కల్‌ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని రైతు భూమిలో శుక్రవారం పురాతన విగ్రహ నమూనాలు బయటపడ్డాయి.

 • గ్రామాల్లో తపాలా బ్యాంకు సేవలు August 27, 2016 00:30 (IST)
  తపాలా శాఖ తన సేవలను విస్తృత పరుచనుంది. బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగిడనుంది. ఈ మేరకు భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి బ్యాంకింగ్‌ ఆవిర్భావ ధృవపత్రాన్ని పొందింది. భారత తపాలా శాఖ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌లోకి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రజలకు సులువుగా బ్యాం కింగ్‌ సేవలు అందనున్నాయి.

 • వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర August 27, 2016 00:29 (IST)
  భారతదేశానికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగ యాత్రను చేపట్టినట్లు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పరకాలలో తిరంగయాత్రను నిర్వహించారు.

 • నైపుణ్యం పెంచుకోవాలి August 27, 2016 00:25 (IST)
  సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఆర్గనైజర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు వృత్తిలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలని అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీరాం సూచించారు. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వై ద్యారోగ్య శాఖలోని పలు పథకాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 • అప్పీళ్ల పరిశీలన August 27, 2016 00:23 (IST)
  కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అభ్యంతరాన్ని జిల్లా కలెక్టర్‌ స్వయంగా పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జిల్లాల ఏర్పాటు అప్పీళ్ల కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో నమోదైనదరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు.

 • రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ August 27, 2016 00:21 (IST)
  సాక్షి ఫొటోగ్రాఫర్‌ సంపెట వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టు ఛాయాచిత్ర పోటీల్లో వెంకటేశ్వర్లు తీసిన ‘పల్లెవాగులు–జలకాలు’ చిత్రం రెండో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైంది.

 • నకిలీ పాస్‌ పుస్తకాల కేసులో ఇద్దరి అరెస్ట్‌ August 27, 2016 00:19 (IST)
  నకిలీ పాస్‌ పుస్తకాల తయారీ కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ఎంబాడి సత్యనారాయణ తెలి పారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వీఆర్వో, తహసీల్దార్‌ కార్యాలయ అటెండర్‌ పరారీలో ఉన్నారని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. కొడకండ్ల శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్‌ భీమానాయక్‌ మండలంలోని వివిధ గ్రామాల రైతుల పేరిట కంప్యూటర్‌ పహాణీల మోటేషన్, కరెక్షన్‌ల కోసం రెవెన్యూ కార్యాలయంలో 41 దరఖాస్తులు అందజే

© Copyright Sakshi 2016. All rights reserved.