'ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. అందుకు అధికారులు నిబద్ధత, పారదర్శకత, కార్యదీక్షతో పనిచేయాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలువిజయనగరం

విజయనగరం

 • ఏపీలో కొత్తగా 14 పీహెచ్‌సీలు September 26, 2016 15:24 (IST)
  జాతీయ ఆరోగ్యమిషన్(ఎన్‌హెచ్‌ఎం)నిధులతో ఏపీలో మరో 14 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

 • ఈ శిక్ష తగునా..? September 26, 2016 10:30 (IST)
  అభం, శుభం తెలియని ప్రాయం ఆ బాలికది. ఏ తప్పూ చేయకపోయినా..

 • వేడుకగా పైడితల్లి పందిరిరాట మహోత్సవం September 25, 2016 18:31 (IST)
  పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద పందిరిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 • ఎనిమిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ September 25, 2016 10:26 (IST)
  ఎస్.కోటలోని రెల్లివీధిలో ఆదివారం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 • ఇల్లు కూలి దంపతులు మృతి September 25, 2016 09:15 (IST)
  గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలడంతో దంపతులు మృతిచెందారు.

 • ఆకలి కేకలు September 24, 2016 21:48 (IST)
  అరకొర భోజనంతో ఎన్నాళ్లు అవస్థలు పడాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రోజులుగా ఇదే సమస్య. ఇక కడుపుమండిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇదీ బూర్జ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకున్న సంఘటన.

 • మోదం.. ఖేదం September 24, 2016 21:27 (IST)
  మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

 • అన్నం పెట్టలేదని విద్యార్థుల ఆందోళన September 24, 2016 21:07 (IST)
  వంటలు వండక విద్యార్ధులు పస్థులున్నారు. ఒకరోజుకాదు రెండు రోజులుకాదు నిరంతరం ఇదేపరిస్థతి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 25 మంది విద్యార్ధులు ఆకలిని తట్టుకోలేక ఆందోళ ణకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని బూర్జ ఉన్నత పాఠశాలలో 408 మంది విద్యార్ధు లు విద్యనభ్యసిస్తున్నారు.

 • కూలిన పూరిళ్లు.. పశువుల శాల September 24, 2016 20:59 (IST)
  చినబొండపల్లిలో శుక్రవారం రాత్రి కురిసిన వానకు గ్రామానికి చెందిన కోట సూర్యనారాయణ, కోట జోగినాయుడులకు చెందిన పూరిళ్లు కూలిపోయాయి. పక్కనేవున్న చప్ప రాములు పశువుల శాలలో కట్టిన ఆవుపై గోడ పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పూర్తిగా రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో లేవలేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

 • రెండు బస్సులు ఢీ..10 మందికి గాయాలు September 24, 2016 19:38 (IST)
  విజయనగరం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి.

 • మరో మూడు డెంగీ కేసులు September 23, 2016 23:21 (IST)
  జిల్లాలో మరో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు సర్కార్‌ దోమలపై దండయాత్ర పేరుతో ఓ వైపు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సమయంలో వ్యాధుల వ్యాప్తి అధికమవుతుండడం గమనార్హం. విజయనగరం పట్టణంలో రెండు, తోటపల్లిలో మరో డెంగీ కేసు శుక్రవారం నమోదయ్యాయి. విజయనగరం పట్టణంలోని లంక పందిరివీధికి చెందిన హాసిని, గాజులరేగకు చెందిన వివేక్‌సాయి , తోటపల్లికి చెంది స్పందనలకు డెంగీ సోకింది. హాసిని(హర్

 • కాజ్‌వేకు గండి September 23, 2016 23:14 (IST)
  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని తాడూరు – మాతుమూరు గ్రామాల మధ్య వట్టిగెడ్డపైనున్న కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో సుమారు 20 గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. కాజ్‌వే మరమ్మతుల సమయంలో ఇంజినీరింగ్‌ అధికారులు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే కాజ్‌వే కొట్టుకుపోయిందని వైఎస్సార్‌సీపీ నాయకుడు బోను మురళి ఆరోపించారు.

 • మూడు కుటుంబాలకు షాక్‌ September 23, 2016 23:02 (IST)
  రోజూ మాదిరిగానే శుక్రవారం తెల్లారింది. కానీ ఆ మూడు కుటుంబాల్లో విషాదంతో ఉషోదయం పలికింది. విద్యుత్‌రూపంలో మత్యువు ముగ్గురిని కబళించింది. వారిపైనే ఆధారపడిన కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వినాయక నిమజ్జనానికి ఉత్సాహంగా తరలిన ఓ గుంపులో ఇద్దరు... రోజూ మాదిరిగా దైవదర్శనం చేసుకుని దక్షిణ వేయడానికి గ్రిల్స్‌లో చేతులు పెట్టిన మరొకరు షాక్‌తో కన్నుమూశారు.

 • ఏపీలో వాన బీభత్సం.. September 23, 2016 04:12 (IST)
  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి.

 • కొనసాగుతున్న మరణమదంగం September 22, 2016 23:19 (IST)
  పార్వతీపురం మన్యంలో మరో గిరి పసిమొగ్గ రాలింది. గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న పువ్వుల నితిన్‌(9) అనారోగ్యంతో గురువారం కన్నుమూశాడు.

 • ‘క్లోజ్‌’వే! September 22, 2016 23:10 (IST)
  పాచిపెంట మండలం మోసూరు వద్ద వట్టిగెడ్డపై నిర్మించిన కాజ్‌వే గురువారం మధ్యాహ్నం కొట్టుకుపోయింది. అదే సమయంలో గెడ్డదాటుతున్న నలుగురు కొట్టుకుపోగా... వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 • కరుణించిన వరుణుడు September 22, 2016 23:02 (IST)
  ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. రెండు రోజులపాటు విస్తారంగా వానలు కురిపించాడు. జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరునుంచి... భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని చోట్ల నదులు, వాగులు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. అయితే మధ్యమధ్యలో తెరిపిస్తుండటంతో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అదను దాటుతున్న వేళ కురిసిన వానలు ఖరీఫ్‌కు కొత్త ఊపిరి పోసినట్టయింది.

 • ఆమె ఎక్కడ? September 22, 2016 22:54 (IST)
  పదవి ఆమెకు అనుకోకుండా దక్కిన వరం. ప్రజాసేవంటే చాలా నిర్లక్ష్యం. నమ్ముకున్న గిరిజనానికి... ఆమెను ఓటేసి గెలిపించిన ప్రజలకు... నమ్మి టిక్కెట్టిచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఘనత ఆమెది. ఇక ఆమె వ్యవహారం వివాదాల మయం. ఎస్‌డీసీగా ఉన్నపుడే హైదరాబాద్‌లో ఐదువేల కోట్ల విలువైన 523.39ఎకరాల సర్కార్‌ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నడం... ఒకరికి ఒకే పాస్‌పోర్టు ఉండాలన్న నిబంధన తోసిరాజని రెండు పాసుపోర్టులు పొందడ

 • తాటిపూడి రిజర్వాయర్‌లో శవం September 22, 2016 11:24 (IST)
  గంట్యాడలోని తాటిపూడి రిజర్వాయర్‌లో గురువారం శవం కనిపించింది.

 • మేట్ల మేత September 21, 2016 23:38 (IST)
  ఉపాధి పథకంలో సీనియర్‌ మేట్ల చేతివాటం పెరిగింది. తప్పుడు మస్తర్లతో నిధుల స్వాహా జరుగుతోంది. ఉపాధి వేతనదారులకు మొండిచెయ్యి మిగులుతోంది. తప్పుడు మస్తర్లతో సీనియర్‌ మేట్లు నిధులు స్వాహా చేస్తున్నారు.. అని ఉపాధి వేతనదారులు ముదిలి జనార్థన, పద్మ, భాగ్యం, స్వామినాయుడు తదితరులు ఆరోపించారు.

© Copyright Sakshi 2016. All rights reserved.