'ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్లాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుశ్రీకాకుళం

శ్రీకాకుళం

 • 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత September 25, 2016 11:45 (IST)
  అక్రమంగా రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు 30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

 • బరితెగించారు..! September 24, 2016 23:42 (IST)
  చౌక ధరల దుకాణాల నుంచి పేదలకు చేరాల్సిన బియ్యం రైస్‌ మిల్లులకు తరలిస్తున్న ఘటన టెక్కలిలో శనివారం వెలుగుచూసింది. టెక్కలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బహిరంగంగా 3 రిక్షాలతో సుమారు 9 బస్తాలు (ఒక్కో బస్తా సుమారు 50 కేజీలు) పీడీఎస్‌ బియ్యంను రైస్‌ మిల్లుకు తరలిస్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆర్‌ఐ వెంకటరమణతో పాటు దిగువ స్థాయి సిబ్బంది దాడిచేశారు. మూడు రిక్షాల్లో రెండింటిని పట్టుకున్నారు.

 • యువత జాతి సంపద September 24, 2016 23:39 (IST)
  యువత జాతి సంపదగా డాక్టర్‌ బీఆర్‌ అండ్కేర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గుంట తులసీరావు పేర్కొన్నారు. ఎచ్చెర్ల సాంకేతిక శిక్షణ కేంద్రంలో నెహ్రూయువ కేంద్రం అధ్వర్యంలో వారంరోజులుగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జాతీయ యువ వలంటీర్లకు నిర్వహించిన పునశ్చరణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజానికి ఉత్తమ మానవ వనరులు అవసరమన్నారు.

 • అమర జవాన్లకు జోహార్లు September 24, 2016 23:36 (IST)
  కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన జవాన్లకు కిరణ్మయి డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. జవాన్లకు అమర్‌ రహా అంటు నినాదాలు చేశారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ టి.మానస, అధ్యాపకులు పాల్గొన్నారు.

 • మత్స్యకారులపై వివక్ష September 24, 2016 23:32 (IST)
  మత్స్యకారులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలు, భృతి చెల్లించడంలో టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. శనివారం డొంకూరులో పర్యటించి మత్స్యకారులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్‌ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన హామీలు బంగాళాఖాతంలో...

 • ‘ఫార్మశీ’లో ఉపాధి అవకాశాలు పుష్కలం September 24, 2016 23:27 (IST)
  ఫార్మశీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్కలి డివిజన్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.లావణ్య అన్నారు. చిలకపాలెం సమీపంలోని శివానీ ఇ ంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ప్రపంచ ఫార్మశీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా బోధన ప్రయోగాత్మకంగా ఉండాలన్నారు.

 • రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి September 24, 2016 23:24 (IST)
  జాతీయ రహదారిపై శివశంకర్‌ మోటార్స్‌ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. బంధువుల ఇంటికని బయలుదేరిన వారు అక్కడకు వెళ్లి కాసేపు యోగక్షేమాలు మాట్లాడిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. వివరాల్లోకి వెళ్తే...జలుమూరు మండలం బుడితిలక్ష్మీపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు పొన్నాన వెంకటరమణమూర్తి(43), విజయలక్ష్మి(36) నగరంలోని బలగ వద్ద ఉంటున

 • అశ్లీల చిత్రాల ముఠా గుట్టు రట్టు September 24, 2016 23:21 (IST)
  జిల్లాలో వారం రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఆమదాలవలసలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ నవీన్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

 • వర్షాలతో ఆలస్యంగా నడిచిన రైళ్లు September 23, 2016 23:35 (IST)
  రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి. సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్‌ల మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రయాణించాయి. ఉదయం ప్రశాంతి, హౌరా–చెన్నై సూపర్‌ఫాస్ట్‌ మెయిల్, ఇంటర్‌ సిటీ, విశాఖ, హౌరా–తిరుచినాపల్లి ...

 • కిడ్నీ వ్యాధులపై కేజీహెచ్‌ వైద్యుల అధ్యయనం September 23, 2016 23:32 (IST)
  ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తిపై విశాఖపట్నం కేజీహెచ్‌ వైద్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. కవిటి మండలం బొరివంక పీహెచ్‌సీలో కేజీహెచ్‌ నెఫ్రాలజీ విభాగం నిపుణులు డాక్టర్‌ బి.భాస్కర్, కమ్యూనిటీ సర్వీసెస్‌ విభాగం సహాయక సిబ్బంది క్రాంతి, సురేంద్రలు కిడ్నీరోగులను పరీక్షించారు.

 • రాష్ట్రంలో 1206 డెంగీ కేసుల నమోదు September 23, 2016 23:29 (IST)
  రాష్ట్రంలో ఇప్పటివరకు 1206 డెంగీ కేసులు నమోదుకాగా శ్రీకాకుళం జిల్లాలో 56 కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య శాఖ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సావిత్రి తెలిపారు. మండలంలోని పెంట గ్రామాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. తాగునీటి వనరుల వద్ద మురుగునీరు నిల్వ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

 • గ్రామాల్లోకి సువర్ణముఖి నీరు September 23, 2016 23:26 (IST)
  కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాల్లోకి సువర్ణముఖి నది నీరు శుక్రవారం వేకువజామున ప్రవేశించింది. గురువారం అర్ధరాత్రి వరకు నదుల్లో ఎటువంటి నీటి ప్రవాహం లేకున్నా ఒక్కసారిగా శుక్రవారం వేకువజామున సువర్ణముఖి, వేగావతి నదుల్లో నీటి ఉధృతి భారీగా పెరిగింది. 60వేల క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహించింది. అప్పటి వరకు మడ్డువలస గేట్లు ఎత్తకపోవడంతో నీరు పోటెత్తింది.

 • టి.లింగాలపాడులో తుపాకీ కలకలం! September 23, 2016 23:22 (IST)
  టి.లింగాలపాడులో నాటు తుపాకీతో వేట సాగుతోందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గడిచిన ఆదివారం గ్రామంలో ఒక విందు భోజనం జరిగిన సమయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి జలుమూరు పోలీసులు వెళ్లారు. అదే సమయంలో గ్రామానికి చెందిన చల్ల భుజంగరావు తుపాకీతో సమీప చెరువులో బాతులను వేటాడుతుండగా పోలీసులు పసిగట్టి ఎస్‌ఐ నరసింహామూర్తికి సమాచారం ఇచ్చారు.

 • సైకో సంచార వార్తలతో ఆందోళన September 23, 2016 23:20 (IST)
  తమ ప్రాంతంలో సైకో సంచరిస్తున్నట్టు వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్నామని తగు చర్యలు తీసుకోవాలని పలాసపురం పంచాయతీ లక్కవరం గ్రామస్తులు ఎస్‌ఐ కె.భాస్కరరావును కోరారు.

 • నిప్పుంటుకొని మహిళకు గాయాలు September 23, 2016 23:16 (IST)
  మండల పరిధిలోని దోసరిరామినాయుడువలస గ్రామంలో గురువారం రాత్రి నిప్పుంటుకొని వన్నలి పుష్ప(35)అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వంట చేస్తున్న సమయంలో కిరోసిన్‌ స్టౌపై నుంచి వంట పాత్రను దించుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడిపోవడంతో నిప్పు అంటుకుంది. దీంతో సుమారు 70 శాతం శరీరం కాలిపోయింది. స్థానికులు క్షతగాత్రురాలిని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు గార రవిప్రసాద్‌ చికిత్సనందించారు.

 • భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు September 23, 2016 08:37 (IST)
  భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి.

 • రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు September 22, 2016 20:30 (IST)
  గతేడాది లిబియాలో ఉగ్రవాదులు చేతుల్లో కిడ్నాప్ కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు.

 • శాంతిభద్రతల పరిరక్షణలో బీజేపీ విఫలం September 21, 2016 23:34 (IST)
  శాంతిభద్రతల విషయంలో బీజేపీ తీరు సక్రమంగా లేకపోవడం వల్లే కశ్మీర్‌ మరోసారి నెత్తురోడిందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ అన్నారు. కశ్మీర్‌లో దాడులను నిరసిస్తూ బుధవారం శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌ కూడలిలో ర్యాలీ నిర్వహించారు.

 • స్వల్పంగా పెరిగిన మడ్డువలస September 21, 2016 23:32 (IST)
  మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం స్వల్పంగా పెరిగింది. సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోకి 7 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 63.80 మీటర్ల లెవెల్‌ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద మూడుగేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్టు డీఈ జి.పద్మజ తెలిపారు.

 • ఆటో బోల్తా : తొమ్మిది మందికి గాయాలు September 21, 2016 23:30 (IST)
  మండలంలోని పూతికవలస పంచాయతీ పరిధిలోని బంజారుగూడకు సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈతమానుగూడకు చెందిన 12 మంది గిరిజనులు ఆటోలో పూతికవలస వైపు బుధవారం వస్తుండగా మార్గమధ్యలో బంజారుగూడ డౌన్‌ దిగుతుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది.

© Copyright Sakshi 2016. All rights reserved.