'నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం, అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలురంగారెడ్డి

రంగారెడ్డి

 • ‘వికారాబాద్ జిల్లా కావడం సంతోషం’ August 26, 2016 14:31 (IST)
  నూతనంగా ఏర్పాటు చేస్తున్న 17 కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు కూడా స్థానం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు అన్నారు.

 • సీఎం చిత్రపటానికి పాలాభిషేకం August 25, 2016 23:13 (IST)
  కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు మహారాష్ర్టతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజనకు కృషి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 • భారీ ఎత్తున గంజాయి స్వాధీనం August 25, 2016 22:44 (IST)
  తాండూరులో రైల్వే పోలీసులు భారీ ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు. రైలులో తరలిస్తుండగా సుమారు రూ. 20 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • మొయినాబాద్‌లో భారీ వర్షం August 25, 2016 21:00 (IST)
  నెల రోజుల తరువాత వరుణదేవుడు కరుణించాడు. చాలారోజుల తరువాత భారీ వర్షం కురిసి ఎండిపోతున్న పంటలకు జీవపోసింది. పంటలపై ఆశలు వదులుకున్న సమయంలో ఈ వర్షం జీవం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 • రోడ్డు ప్రమాదం- ఐదుగురికి గాయాలు August 25, 2016 20:08 (IST)
  ఓ లారీ బైకును మరో లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగల మైసమ్మ చౌరాస్తా వద్ద రాజీవ్‌ రహదారిపై బుధవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది.

 • సీఎం కేసీఆర్‌ది సెంట్‌మెంట్‌ పాలన August 25, 2016 19:56 (IST)
  తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సెంట్‌మెంట్‌ పరిపాలన చేస్తున్నారని, మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాడని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి మండిపడ్డారు.

 • మా గ్రామాలను మహబూబ్‌నగర్‌లో కలపండి August 25, 2016 19:45 (IST)
  తమ గ్రామాలను మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలపాలని మండల పరిధిలోని మరికల్‌, మల్కాపూర్‌, చాకల్‌పల్లి, కల్మన్‌కల్వ, కొత్తపల్లి గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు గురువారం కుల్కచర్ల-నవాబ్‌పేట్‌ రోడ్డుపై గురువారం బైఠాయించారు.

 • షాబాద్‌ మండలాన్నిశంషాబాద్‌ జిల్లాలో కలపాలి August 25, 2016 19:16 (IST)
  షాబాద్‌ మండలాన్ని శంషాబాద్‌ జిల్లాలో కలిపేవరకు అఖిలపక్షం ఆధర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఎ.రవీందర్‌రెడ్డి, బీసీ సేన రాష్ర్ట అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ డిమాండ్‌ చేశారు.

 • నష్టపోయిన రైతులను ఆదుకోవాలి August 25, 2016 19:15 (IST)
  పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆరుట్ల గ్రామంలో ఎండిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.

 • పేదల భూములు లాక్కోవడం హేయం August 25, 2016 19:03 (IST)
  నిరుపేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కొవడం హేయమైన చర్య అని పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మోకిల గ్రామాన్ని సందర్శించింది వివరాలు సేకరించింది.

 • రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం August 25, 2016 18:10 (IST)
  పలు సామాజిక, విద్యాసంబంధమైన సేవా కార్యక్రమాలను చేసినందుకు చేవెళ్లకు చెందిన ఉపాద్యాయుడు పి.రామకృష్ణారావుకు శిఖరం ఆర్ట్‌ అసోసియేషన్‌ పురస్కారాన్ని అందజేసింది.

 • యువతకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ August 25, 2016 18:07 (IST)
  జిల్లాలోని పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలోపు వారందరికీ ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తామని నెట్‌వల్డ్‌ సోల్యూషన్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. computer training, youth Net world Solution

 • 30న శ్రీరామ్‌ చిట్స్‌ జాబ్‌ మేళా August 25, 2016 17:47 (IST)
  శ్రీరామ్‌ చిట్స్‌లో 20 ఖాళీల భర్తీ కోసం ఈ నెల 30న పట్టణంలోని సబ్‌ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

 • వర్షాల కోసం జలాభిషేకం... August 25, 2016 17:37 (IST)
  వర్షాలు కురియాలని కోరుతూ పూడూరు మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి గురువారం జలాభిషేకం చేశారు.

 • సందడిగా కృష్ణాష్టమి వేడుకలు August 25, 2016 17:08 (IST)
  మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు సందడిగా జరిగాయి. పాఠశాలల్లో విద్యార్థుళు గోపిక, కృష్ణుల వేషధారణలతో అలరించారు. చిన్నారులతో ఉట్టిలు కొట్టడంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 • 5 లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు August 25, 2016 01:26 (IST)
  తీవ్రమైన వర్షాభావం కారణంగా రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయశాఖ వెల్లడించింది.

 • ‘నా చావుకు మాజీ కమిషనరే కారణం’ August 25, 2016 00:14 (IST)
  రంగారెడ్డి జిల్లా తాండూరు ఐకేపీ డేటాఎంట్రీ ఆపరేటర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • తాండూరులో కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య August 24, 2016 19:24 (IST)
  రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • చెల్లని చెక్కు కేసులో నిందితునికి జరిమానా August 24, 2016 19:01 (IST)
  చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు.

 • కొండాపూర్‌లో చోరీ August 23, 2016 15:48 (IST)
  రంగారెడ్డి జిల్లా ఘటేకేసర్ మండలం కొండాపూర్‌లో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది.

© Copyright Sakshi 2016. All rights reserved.