'ఎవరినైనా బలహీనవర్గాలు అని అంటున్నామంటే అది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టే. మేధస్సులో వాళ్ళు ఎవరికీ తీసిపోరు'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుమహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

 • నీళ్లున్నా.. నిట్టూర్పే! July 27, 2016 01:13 (IST)
  నీటి వనరులు కళకళడుతున్నా తాగునీటికి నిట్టూర్పే..! వర్షాకాలంలోనూ గుక్కెడు నీళ్ల కోసం అర్రులు చాచాల్సిందే.. ప్రధాన తాగునీటి వనరు రామన్‌పాడు రిజర్వాయర్‌లో పుష్కలంగా నీళ్లున్నా వాడుకోలేని దుస్థితి. కారణం పైప్‌లైన్లు తరచూ పగిలిపోవడమే.. పైపుల మరమ్మతు పనులు ఇంకా కొనసా.. గుతూనే ఉన్నాయి.

 • ‘పుష్కర’ పనులకు ఆగస్టు 5 డెడ్‌లైన్‌! July 27, 2016 01:13 (IST)
  మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా వస్తున్న కష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పనులను ఆగస్టు 5వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లు, పనుల పురోగతిపై సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు.

 • సీనియర్‌ సహాయకులకు పదోన్నతి July 27, 2016 01:01 (IST)
  మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : వివిధశాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆయా మండలాల్లో పనిచేస్తున్న సీనియర్‌ సహాయకులకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీదేవి, పరిపాలనాధికారి నర్సయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు.

 • చిన్నారులకు దుప్పట్ల పంపిణీ July 27, 2016 00:57 (IST)
  జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గల కస్తూరిబాయి అనాథ ఆశ్రమంలో చిన్నారులకు మంగళవారం ఎస్పీ రెమారాజేశ్వరి దుప్పట్లు, మిఠాయిలు, కేక్, చాక్లెట్స్, పండ్లు పంపిణీ చేశారు. వారి క్షేమ సమాచారాలు, బాగోగులు గురించి ఆరాతీశారు. వసతిగృహా నిర్వహణ, చిన్నారుల భోజనం, ఆరోగ్య అంశాలపై నిర్వహణ దారులతో మాట్లాడారు.

 • భూమికి భూమే కావాలి July 27, 2016 00:52 (IST)
  మండల పరిధిలోని ఎక్వాయిపల్లిలో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయడానికిగాను మంగళవారం అధికారులు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు భూమిని తాము ఇవ్వడంలేదని, భూమికి బదులుగా భూమిని ఇవ్వాలని, భూ సేకరణ నిలిపివేయాలని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 • జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో July 27, 2016 00:51 (IST)
  : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం 22వేల క్యూసెక్కుల వరద రావడంతో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 24వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

 • మహిళాసంఘాల పనితీరు భేష్‌! July 27, 2016 00:42 (IST)
  కొత్తకోట : తెలంగాణలోని మహిళా సంఘాల పనితీరు బాగుంది.. ఆర్థిక లావాదేవీలు.. రుణాలతో ఉపాధి పొందుతూ సకాలంలో చెల్లించడం.. పొదుపు మంత్రం బాగుందని యూపీ అధికారుల బందం ఖితాబిచ్చింది. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించిన యూపీ అధికారులు మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించింది.

 • మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే July 27, 2016 00:40 (IST)
  సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను సంబంధిత శాఖలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లకు సూచించారు. హరితహారం కార్యక్రమంపై మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

 • ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి July 27, 2016 00:30 (IST)
  నాగర్‌కర్నూల్‌రూరల్‌: రెండో ఏఎ¯Œæఎంలు తమ డిమాండ్ల సాధన కోసం తొమ్మిదిరోజులుగా చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం మొండివైఖరి వీడి వాటి పరిష్కారానికి కృషిచేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 • బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించాలి July 27, 2016 00:28 (IST)
  మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను తొందరగా గుర్తించడం చాలా అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగారాం సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రస్తుత వాతావారణం, ఆహార అలవాట్ల కారణంగా మహిళలో రొమ్ము(బ్రెస్ట్‌) క్యాన్సర్‌ అధికంగా వస్తుందని చెప్పారు.

 • సమస్యల పరిష్కారం కోసమే ‘పల్లె వికాసం’ July 27, 2016 00:18 (IST)
  ఆకునెల్లికుదురు(తాడూరు): గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం కోసమే పల్లె వికాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి నాగార్జునరెడ్డి అన్నారు.

 • ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు.. July 27, 2016 00:11 (IST)
  నాగర్‌కర్నూల్‌రూరల్‌: ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి ఆరోపించారు.

 • గొందిమల్ల ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు July 27, 2016 00:07 (IST)
  కృష్ణానదిలో కొన్ని నీళ్లు ఉన్నా పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గొందిమల్ల వీఐపీ ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీ రాంకిషన్‌లతో కలిసి సందర్శించారు.

 • కృష్ణవేణి నమస్తుభ్యం July 26, 2016 23:58 (IST)
  దేశంలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి తర్వాత నాలుగో పెద్దనది కృష్ణానది. ప్రకృతిలోని అనేక వన మూలికలను తాకుతూ ప్రవహించడంతో కృష్ణానదిలోని నీరు ఔషధిసంస్కారాన్ని సంతరించుకుంది. కృష్ణానీటితో ఎన్నో క్షేత్రాలలోని అధిష్టాన దేవతలకు ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతున్నాయి. పర్వకాలాల్లో, గ్రహణ సమయాల్లో, యజ్ఞ యాగాది క్రతువుల ప్రారంభసమయంలో కృష్ణానది నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది.

 • భీమా ఫేజ్‌–2 పంప్‌హౌస్‌ ట్రయల్‌రన్‌ July 26, 2016 23:44 (IST)
  మక్తల్‌ : పట్టణ సమీపంలోని భీమా ఫేజ్‌–2 పంప్‌హౌస్‌ను మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. రెండోసారి ట్రయల్‌రన్‌ చేశారు. పంప్‌హౌస్‌ నుంచి మోటార్‌ను ప్రారంభించిన అనంతరం సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని వదిలారు.

 • పుష్కరస్నానం కష్టమే! July 26, 2016 23:41 (IST)
  రోజురోజుకూ పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి రెండుఘాట్ల పనులు మినహా మిగిలినవి మందకొడిగా సాగుతున్నాయి. వీటి వేగం పుంజుకోవాల్సి ఉంది. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, గద్వాల మండలాల పరిధిలో మొత్తం తొమ్మిది పుష్కరఘాట్లను నిర్మిస్తున్నారు. అందులో కొన్నిఘాట్ల పనులు పూర్తి కావచ్చాయి. మరికొన్ని ఘాట్ల దగ్గర పనులు నత్తనడకన సాగు..తున్నాయి.

 • అమరచింతలో కలకలం July 26, 2016 23:39 (IST)
  ఆత్మకూర్‌(నర్వ) : అమరచింతలోని శివాజీనగర్‌లో సోమవారం రాత్రి క్షద్రపూజలు నిర్వహించి రక్తాన్ని పరిసరాల్లో చల్లారనే పుకార్లు మంగళవారం తెల్లవారుజామున వినిపించా యి. దీంతో గ్రామస్తులు శివాజీనగర్‌లోని ఆ ప్రదేశానికి తరలివచ్చారు. ఎస్‌ఐ సీహెచ్‌ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

 • 3,667 మంది అర్హత July 26, 2016 23:31 (IST)
  కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం 800 మీటర్ల పరుగులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఛాతీ, ఎత్తు, బరువు చూడటంతో తదితర ఈవెంట్స్‌ను నిర్వహించారు. మొత్తం 1541మంది అభ్యర్థులు హాజరుకాగా, 903మంది ఇతర నాలుగు రకాల దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు.

 • చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాలు July 26, 2016 23:10 (IST)
  కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణా పుష్కరాలు చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహిస్తామన్నారు. మండలపరిధిలోని సోమశిలలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జరుగుతున్న ఘాట్ల పనులను మంత్రి జూపల్లితో కలిసి ఆయన పరిశీలించారు.

 • కేసీఆర్‌వి ఆంధ్రా జీన్స్: నాగం July 26, 2016 02:47 (IST)
  తనలో ఆంధ్ర ప్రాంత రక్తం ప్రవహిస్తుందని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డి మాట్లాడటాన్ని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఖండించారు.

© Copyright Sakshi 2016. All rights reserved.