'సామాన్యులకు వైద్యం ఏనాడూ ఖరీదుగా ఉండకూడదు. అందుకే అందరికీ ఆరోగ్యశ్రీ'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుఖమ్మం

ఖమ్మం

 • రజక కుటుంబాల బహిష్కరణ August 29, 2016 00:27 (IST)
  ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పది రజక కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నట్లు స్థానిక ఊరి పెద్దలు టమకా వేయించి అవమానించారు.

 • కత్తితో ముగ్గురిపై దాడి August 29, 2016 00:26 (IST)
  కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిపై కత్తితో దాడి చేసిన సంఘటన కొత్తగూడెం మండల పరిధిలోని కారుకొండపంచాయతీ తెలగ రామవరం ఎస్సీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది.

 • ఖమ్మం జేడీఏగా ఝాన్సీలక్ష్మీకుమారి August 29, 2016 00:21 (IST)
  ఖమ్మం సంయుక్త వ్యవసాయ సంచాలకురాలి(జేడీఏ)గా అత్తోటి ఝాన్సీలక్ష్మీకుమారి రానున్నారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయంలో వ్యవసాయ ఉప సంచాలకురాలిగా పనిచేస్తున్నారు.

 • విద్యుదాఘాతంతో మహిళ మృతి August 29, 2016 00:20 (IST)
  ఇల్లు శుభ్రం చేసి, ఇంటి వెనుక ఊడ్చేందుకు వెళ్లిన మహిళలకు అక్రమ విద్యుత్‌ కనెక్షన్‌తో సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని న్యూలక్ష్మిపురంలో ఆదివారం చోటు చేసుకుంది.

 • భద్రాచలంలోని రామాలయంలో దొంగెవరు? August 29, 2016 00:20 (IST)
  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మాయమైన బంగారు నగలు దొరికినా కేసు మిస్టరీగానే మిగిలింది. ఆలయంలోని కొంతమంది అర్చకులే వీటిని మాయం చేశారనే ప్రచారం దాదాపు నిజమైనప్పటికీ.. ఆ ఇంటి దొంగలు ఎవరనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.

 • మళ్లీ పోరుకు సిద్ధం August 29, 2016 00:07 (IST)
  కాపులకు రిజర్వేషన్ల కోసం ఏపీలో అవసరమైతే మళ్లీ పోరాటానికి సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్‌ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

 • అలరించిన ‘నెలనెలా వెన్నెల’ August 29, 2016 00:06 (IST)
  నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో అన్నాబత్తుల రవీంధ్రనాథ్‌ కళాసాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రెండు నాటికలు ‘బాధ్యత’, ‘భజంత్రీలు’ ప్రదర్శితమయ్యాయి. ప్రతి నెల నిర్వహిస్తున్న నెలనెలా వెన్నెల 15వ నెల కార్యక్రమమిది.

 • కిన్నెరసాని వాగులో పడి ఒకరు మృతి August 29, 2016 00:04 (IST)
  కిన్నెరసాని వాగులో సరదాగా ఈత కొడుతూ ప్రమాదవశాత్తు అందులో మునిగి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం నాగారంలో చోటు చేసుకుంది.

 • డెంగీ లక్షణాలతో యువకుడి మృతి August 28, 2016 23:44 (IST)
  డెంగీ జ్వరం లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సింగరాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది.

 • ‘కొత్త’ కార్యాలయాల కోసం కసరత్తు August 28, 2016 23:32 (IST)
  కొత్తగూడెం జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం సింగరేణి భవనాలను స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆదివారం పరిశీలించారు.

 • పోటెత్తిన భక్తజనం August 28, 2016 23:30 (IST)
  రావణమాసంలో చివరి ఆదివారం కావడంతో పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు పోటేత్తారు. మండల పరిధి కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువు తీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ప్రాంగణం కిక్కిరిసింది.

 • పెరుగుతున్న పాలేరు నీటిమట్టం August 28, 2016 23:25 (IST)
  సాగర్‌ నుంచి మెుదటి జోన్‌కు నీటిని విడుదల చేయగా ఆ నీరు పాలేరు రిజర్వాయర్‌కు చేరుతుండటంతో రిజర్వాయర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆదివారానికి నీటి మట్టం 10 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. రోజుకు రెండు క్యూసెక్కుల నీరు చొప్పున పది రోజుల పాటు సాగర్‌ నీరు రిజర్వాయర్‌కు చేరుతుంది.

 • రామయ్యకు ఘనంగా స్వర్ణ పుష్పార్చన August 28, 2016 23:21 (IST)
  భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం ఘనంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ నుంచి తీర్థ జలాలు తీసుకుని వచ్చి అంతరాలయంలో స్వామి వారికి అభిషేకం చేశారు.

 • రాములోరి సన్నిధిలో మాజీ ప్రధాని August 28, 2016 23:03 (IST)
  శ్రీసీతారామచంద్ర స్వామి వారిని భారత మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ.దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ ఆదివారం దర్శించుకున్నారు.

 • భద్రాద్రిలో మాజీ ప్రధాని పూజలు August 28, 2016 18:38 (IST)
  సతీమణి చెన్నమ్మతో కలిసి మాజీ ప్రధాని దేవేగౌడ ఆదివారం భద్రాద్రి రాముణ్ని దర్శించుకున్నారు.

 • ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని లారీ దగ్ధం August 28, 2016 08:33 (IST)
  బొగ్గు లోడుతో ఉన్నలారీ అదుపు తప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది.

 • బొగతలో ఇంజనీర్‌ గల్లంతు August 28, 2016 00:51 (IST)
  బొగత అందాలను ఆస్వాదించేందుకు..అందులో జలకాలాడేందుకు వరంగల్‌ జిల్లా నుంచి వచ్చిన యువకులలో ఒకరు గల్లంతయ్యారు.

 • అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత సంచారం August 28, 2016 00:44 (IST)
  అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు లభించాయి. పాదాల గుర్తుల ఆధారంగా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు

 • కొత్త జిల్లాకు కొత్త స్టేషన్లు August 28, 2016 00:39 (IST)
  :కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా లో కొత్తగా ఆరు పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఎస్పీ షానవాజ్‌ ఖాసీం చెప్పారు. పాల్వంచ పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లను ఆయన శనివారం పరిశీలించారు

 • దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు August 28, 2016 00:23 (IST)
  ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన బంగారు ఆభరణాలు శనివారం దొరికాయి.

© Copyright Sakshi 2016. All rights reserved.