'నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం, అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకరీంనగర్

కరీంనగర్

 • మాడిన మధ్యా‘అన్నం’ July 28, 2016 23:58 (IST)
  జ్యోతినగర్‌ : ఈ ఫొటోల్లో భోజనం చేస్తున్న విద్యార్థులంతా రామగుండం కార్పొరేషన్‌ మూడో డివిజన్‌ పరిధిలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టకపోవడంతో కడుపుమాడ్చుకుంటున్నారు. కొందరు ఆకలి తట్టుకోలేక ఇలా మాడిపోయిన అన్నం తింటున్నారు.

 • అడ్డొస్తే అంతే.. July 28, 2016 23:53 (IST)
  జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నాయకులు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇసుక స్మగ్లర్లు దేనికైనా బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారులపై దాడులకు దిగుతున్నారు.

 • గల్ఫ్‌ బాధితుడి ఆత్మహత్య July 28, 2016 23:45 (IST)
  మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన సందెల నరేష్‌ (28) అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

 • నగర రోడ్లకు మరో రూ.37 కోట్లు July 28, 2016 23:44 (IST)
  తెలంగాణలోనే కరీంనగర్‌ను సుందరనగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారుల అభివృద్ధికి అదనంగా మరో రూ.37 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. గురువారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 • ముంపు ముంగిట్లో కుక్కలగూడూర్‌ July 28, 2016 23:43 (IST)
  బసంత్‌నగర్‌ : రామగుండం మండలం కుక్కలగూడుర్‌ గ్రామం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ముంపు గుప్పిట్లోకి వెళుతోంది. గతకొద్ది రోజులుగా ఎల్లంపల్లి ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌ లోనికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ సామర్థ్యానికి అనుగుణంగా అధికారులు ఈసారి నీటిని నిల్వ చేస్తున్నారు.

 • కరీంనగర్‌లో కరాటే అకాడమీ ఏర్పాటుపై దృష్టి July 28, 2016 23:35 (IST)
  కరాటేలో కరీంనగర్‌ జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని సినీనటుడు, ఐబీకేవో అధ్యక్షుడు సుమన్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆగస్టులో ఇండోనేషియాలో జరుగనున్న ఇంటర్నేషనల్‌ కరాటే పోటీల్లో పాల్గొనే భారత జట్టు జాబితాను ప్రకటించారు.

 • ఆగస్టు 3న ‘సకల’ వేతనాలు July 28, 2016 23:34 (IST)
  గోదావరిఖని(కరీంనగర్‌) : గని కార్మికులకు సకల జనుల సమ్మె కాలపు వేతనాలు ఆగస్టు 3న చెల్లించడానికి సింగరేణి సీఎండీ అంగీకరించారని టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.

 • ప్రజారోగ్యంపై సర్కారు నిర్లక్ష్యం July 28, 2016 23:29 (IST)
  ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభ్తువం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు విమర్శించారు.

 • ఇంటిగ్రేటెడ్‌ ఇంకెప్పుడు పూర్తయ్యేనో? July 28, 2016 23:09 (IST)
  మంథనిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ పనులను ఆలస్యమవుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కాగా, స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శంకుస్థాపన చేశారు.

 • కెటినా ప్రారంభం July 28, 2016 23:00 (IST)
  అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న కెటిన కార్యాలయాన్ని గురువారం సికింద్రాబాద్‌లో జిల్లాకు చెందిన శ్రీనివాస్‌శర్మ, చీటి సతీశ్‌రావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన గుండపనేని చక్రధర్‌రావు ప్రారంభించారు.

 • ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం అండ July 28, 2016 22:57 (IST)
  తెలంగాణ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు అండగా ఉంటుందని రామగుండం మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌ సాయి సేవాసమితి ఆవరణలోని సామాజిక భవనంలో ఆశ సమ్మేళనం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్‌ హాజరై మాట్లాడారు.

 • కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు July 28, 2016 22:46 (IST)
  పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీ చేశారు. మార్కండేయకాలనీలోని కృష్ణవేణి వికాస్, చైతన్య ఇతర కళాశాలలో తరగతి గదుల కొలతలు, కళాశాలలను నిర్వహించే హాజరు పట్టిక, స్కాలర్‌షిప్, ఇతర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కళాశాల చెందినవిషయాలు తెలుసుకున్నారు.

 • ‘నైజాంను మరిపిస్తున్న కేసీఆర్‌’ July 28, 2016 22:41 (IST)
  సీఎం కేసీఆర్‌ పాలన నైజాం, రజాకార్లను మరిపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జైల్లో పెటై్టనా ప్రాజెక్టులు కడుతామని మంత్రులు పేర్కొనడం దౌర్జన్య పాలనకు నిదర్శనమన్నారు.

 • ‘సెస్‌’ కొనుగోళ్లపై మంత్రి కేటీఆర్‌ ఆరా July 28, 2016 22:36 (IST)
  సిరిసిల్ల ‘సెస్‌’ పరిధిలో టెండర్లు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ గురువారం ఆరా తీసినట్లు సమాచారం. ఎల్లారెడ్డిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ ‘సెస్‌’ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని కొనుగోళ్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది.

 • ఇద్దరు దొంగల అరెస్టు July 28, 2016 22:18 (IST)
  కరీంనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వన్‌టౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ విజయసారథి వివరాలు వెల్లడించారు.

 • ఎల్‌ఎండీలో బీసీ బాలికల గురుకుల కళాశాలకు అనుమతి July 28, 2016 22:11 (IST)
  ఎల్‌ఎండీలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 16 బీసీ గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేయగా.. జిల్లాలో ఎల్‌ఎండీలోని బాలికల గురుకుల పాఠశాల ఒకటి.

 • రైలు ఢీకొని ఒకరి మృతి July 28, 2016 22:08 (IST)
  పొత్కపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో జీలకుంట గ్రామానికి చెందిన మామిడాల వెంకటేశ్వర్లు(35) గురువారం ఉదయం ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందాడు.

 • సిరిసిల్లతో అనుబంధం మధురానుభూతి July 28, 2016 22:06 (IST)
  సిరిసిల్లతో అనుబంధం మధురానుభూతిని కలిగించిందని పద్మభూషణ్‌ డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో ఎనిమిది రోజులుగా వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో సినారె సాహితీ ప్రాభవం పేరుతో సినారె సాహిత్యపై ప్రసంగాలు జరిగాయి.

 • మంథని జేఎన్టీయూలో ఆగని ఆందోళన July 28, 2016 21:48 (IST)
  సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు రెండో రోజైన గురువారం కూడా తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు కళాశాల బ్లాక్‌ ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు బైటాయించారు.

 • ప్రధాని పర్యటన రద్దు? July 28, 2016 21:40 (IST)
  ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటన మళ్లీ రద్దయినట్లు సమాచారం.

© Copyright Sakshi 2016. All rights reserved.