'పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుతూర్పు గోదావరి

తూర్పు గోదావరి

 • ముగ్గురూ.. ముగ్గురే..! July 24, 2016 23:35 (IST)
  రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి.. స్వీయ ప్రయోజనాలే పరమావధిగా.. అధికార దాహంతో వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు జిల్లా నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, ఆదిరెడ్డి అప్పారావులు.. అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే.

 • పేదల ఆరాధ్యుడు July 24, 2016 23:16 (IST)
  ఆదివారం వచ్చిందంటే శాంతాక్లాజ్‌ తాతలా గిరిజన బాలల ఎదుట రకరకాల బహుమతులతో ప్రత్యక్షమవుతారాయన. కలం చేతపట్టి బూర్జువా శక్తులను ఎలా ఎదుర్కోవాలో వ్యాసాలు రాస్తారు. పేదలు కనిపిస్తే.. ఆపద్బాంధవుడిలా దుస్తులు, ఆహారం ఇచ్చి ఆదుకుంటారు.

 • ఏడాదైనా ఏదీ వసంతం? July 24, 2016 23:12 (IST)
  ‘గోదావరి మహాపుష్కరాలు విజయవంతమైన నేపథ్యంలో రాజమండ్రి ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే ఈ ‘గోదావరి మహాపుష్కర వనాని’కి అంకురార్పణ చేస్తున్నా’నంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం అందరికీ గుర్తుండే ఉంటుంది. పుష్కరాల ముగింపు సందర్భంగా లాలాచెరువులోని రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో మహాపుష్కర వనానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి మంగళవారం నాటికి ఏడాదవుతుంది

 • దరఖాస్తుల ఆహ్వానం July 24, 2016 22:55 (IST)
  ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో మిగులు ఖాళీల భర్తీకి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జగన్నాధగిరి ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శంకరరావు తెలిపారు.

 • అమలాపురంలో వేద పాఠశాల July 24, 2016 22:50 (IST)
  పట్టణంలో వేద పాఠశాల ఏర్పాటు కానుంది. గత ఏడాది మంజూరైన రూ.60 లక్షల పుష్కర నిధులతో స్థానిక కాలేజీ రోడ్డులోని కొక్కొండ కృష్ణబాయమ్మ సత్రంపై అంతస్తులో దేవాదాయ శాఖ వేదపాఠశాలను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేశారు.

 • గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం July 24, 2016 22:44 (IST)
  ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో మిగులు ఖాళీల భర్తీకి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జగన్నాధగిరి ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శంకరరావు తెలిపారు.

 • ఉన్నత చదువులే లక్ష్యంగా.. July 24, 2016 22:38 (IST)
  క్కని ప్రణాళిక, అంకిత భావంతో పని చేస్తూ అక్కడి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను చక్కగా బోధిస్తున్నారు. విద్యార్థులు సైతం అదే పట్టుదలతో కృషి చేస్తున్నారు. పాఠ్యాంశాలే కాకుండా, ప్రయోగపూర్వకంగా అంశాలు బోధిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉచిత ఇంటర్మీడియట్‌ విద్యతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విద్యకు ఇక్కడి పాఠశాల విద్యార్థులు అర్హత సాధిస్తుండడమే కాక,

 • సం‘క్షామ’ వసతిగృహాలు July 24, 2016 22:33 (IST)
  నిర్వహణ సరిగా లేకపోవడం, తమను సరిగా పట్టించుకోవడం లేదంటూ స్థానిక ఎస్సీ వసతిగృహం విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలకు చెందిన విద్యార్థులు ఆశ్రయం పొందుతూ పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.

 • మడిలో.. తడబడుతూ.. July 24, 2016 22:11 (IST)
  నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి పుణ్యమా అని జిల్లాలో జూన్‌ నెలలో భారీ వర్షాలు కురిశాయి. రైతులు తొలకరిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అనావృష్టితో రెండేళ్లపాటు అష్టకష్టాలు పడ్డ మెట్ట, ఏజెన్సీ రైతులు.. ఈ ఏడాది మంచి దిగుబడి సాధించాలని ఆశించారు. కానీ అవసరమైన సమయంలో కరుణ చూపని వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. జూన్‌లో రెట్టింపు కురిసి..

 • రూటు మారింది! July 24, 2016 22:02 (IST)
  ఇప్పటివరకూ ఏజెన్సీ నుంచి తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, గోకవరం తదితర మండలాల మీదుగా గంజాయి రవాణా జరిగేది. ఇక్కడ పదేపదే దాడులు జరుగుతూండడమో.. మరే కారణమో కానీ.. గంజాయి స్మగ్లర్లు రూటు మార్చినట్టున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గుట్టుగా గంజాయిని అనపర్తి ప్రాంతానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి రవాణా చేస్తున్నారు.

 • సత్యదేవుని దర్శించుకున్న మాడభూషి July 24, 2016 21:53 (IST)
  కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.

 • డ్రై వర్‌పై దాడి కేసులో నలుగురి అరెస్టు July 24, 2016 21:42 (IST)
  ఓ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్‌పై అదే కళాశాలకు చెందిన విద్యార్థితో పాటు ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈనెల 14న అమలాపురం ఈదరపల్లి వంతెనపై శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్‌ గుండుబల్లి శ్రీనివాస్‌పై అమలాపురానికి ..

 • అన్ని జిల్లాల్లో కాపు జేఏసీలు July 24, 2016 21:40 (IST)
  ప్రతి జిల్లాలోను కాపు జేఏసీలను నియమిస్తున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం పలువురు కాపు నాయకులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు.

 • హత్యా.. ఆత్మహత్యా..? July 24, 2016 21:36 (IST)
  వివాహిత అనుమానాస్పదంగా మరణించిన సంఘటన స్థానిక మదన్‌సింగ్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కెల్లా సత్య వెంకట ప్రభాకరరావు స్థానిక మదన్‌సింగ్‌పేటలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

 • ఎంత భద్రం! July 24, 2016 21:30 (IST)
  ఉభయ గోదావరి జిల్లాలకు సేవలందిస్తున్న రాజమహేంద్రవరం విమానాశ్రయం భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం 730 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ విమానాశ్రయానికి భద్రత మరింత పటిష్టం చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం, జల వనరులను దృష్టిలో పెట్టుకుని భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.

 • అన్నవరం దేవునికీ ‘పన్ను’పోటు July 24, 2016 21:06 (IST)
  ఆపన్నులకు రక్షగా నిలిచే రత్నగిరీశునికీ పన్నుపోటు తప్పలేదు. అన్నవరం దేవస్థానంలోని రత్నగిరి, సత్యగిరిపై గల వివిద భవనాలకు సంబంధించి 2015–16 సంవత్సరానికి రూ.20 లక్షల పన్ను చెల్లించాలని అన్నవరం, బెండపూడి పంచాయితీలు దేవస్థానానికి నోటీసులు పంపించాయి. శంఖవరంలోని కల్యాణ మండపానికి రూ.36 వేల ఆస్తిపన్ను చెల్లించాలని..

 • హైవేపై గమ్మత్తుగా.. July 24, 2016 20:56 (IST)
  గంజాయి వ్యాపారం అక్రమార్కులను అడ్డదారిలో అందలమెక్కిస్తోంది. ఒడిశా–విశాఖ సరిహద్దుల్లో ఎక్కువగా పండించే ఈ పంటను రాష్ట్రాల హద్దులు దాటిస్తే.. వారి పంట పండినట్టే. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల విలువైన గంజాయి రవాణాకు 16వ నంబరు జాతీయ రహదారి రాచమార్గంగా మారింది. పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు.

 • కాపు ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చిన్నారావు July 24, 2016 20:48 (IST)
  ఆల్‌ ఇండియా కాపు ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అన్నవరానికి చెందిన లింగంపల్లి చిన్నారావు(బాబ్జీ)ను నియమిస్తూ ఫెడరేషన్‌ అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు ఆదేశాలు జారీచేశారు.

 • లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయం July 24, 2016 20:44 (IST)
  తుని మండలం లోవకొత్తూరులో గల తలుపులమ్మ తల్లి దేవస్థానానికి ఆదివారం తరలివెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదాల కొనుగోలు చేశారు. లోవభక్తుల రద్దీతో స్వామివారి ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద ఆదివారం ..

 • జిల్లాలో 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం July 24, 2016 20:42 (IST)
  జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సగటున 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా యు.కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 118.2 మీల్లీమీటర్లు, అత్యల్పంగా తొండంగి మండలంలో 1.2 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాలవారీగా మారేడుమిల్లిలో 1.8..

© Copyright Sakshi 2016. All rights reserved.