Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుఅనంతపురం

అనంతపురం

 • అన్నదాత సుఖంగా లేకపోతే మనుగడ కష్టం May 24, 2017 02:03 (IST)
  ‘‘అన్నదాతలు సుఖంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. లేదంటే మనం లేం.

 • పూర్వ కలెక్టర్‌ దుర్గాదాస్‌ కన్నుమూత May 24, 2017 00:11 (IST)
  జిల్లాలో కలెక్టర్‌గా పని చేసిన దుర్గాదాస్‌ మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కన్నుమూశారు. ఈయన జిల్లాలో 2011 నుంచి 2013 మధ్య కాలంలో పని చేశారు. జిల్లాలో పని చేసిన కాలంలో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

 • భూ సేకరణకు సిద్ధం కండి May 24, 2017 00:08 (IST)
  జీడిపల్లి నుంచి బీటీపీ వరకు త్వరలో భూ సేకరణ పనులకు సిద్ధంకావాలని ఆర్డీఓ రామారావును జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. గుమ్మఘట్ట మండలం బీటీప్రాజెక్ట్‌ రిజార్వాయర్‌ను మంగళవారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించారు.

 • నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి May 24, 2017 00:04 (IST)
  నీటి వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పండ్లతోటల పెంపకాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. మంగళవారం ఆయన గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో పంటకుంటల నిర్మాణాలు, మల్చింగ్, బిందు, తుంపర సేద్యం ద్వారా అంజూర, చీనీ తోటల సాగును పరిశీలించారు.

 • ఫ్యాక్షన్ నిర్మూలనతోనే పారిశ్రామికాభివృద్ధి May 23, 2017 23:57 (IST)
  ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. తొలుత జిల్లా స్థితిగతులు, నేరాలు, కారణాల గురించి ప్రొజెక్టర్‌ ద్వారా ఎస్పీ రాజశేఖరబాబు వివరించారు.

 • వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు May 23, 2017 14:26 (IST)
  ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి.

 • అనంతలో గవర్నర్‌ విస్తృత పర్యటన May 23, 2017 13:42 (IST)
  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అనంతపురం జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు.

 • ‘ఉపాధి’ చూపే వర్సిటీలకే రాయితీలు May 23, 2017 01:51 (IST)
  ఉపాధి అవకాశాలు చూపించే విశ్వవిద్యాలయాలకే ప్రభుత్వ రాయితీలు అందాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు.

 • జీవచ్ఛవంలా... May 22, 2017 23:06 (IST)
  కళ్లముందు ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దదైన కూతురికి పెళ్లి చేశారు. ఆమె ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తోందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఓ శుభకార్యానికి వెళ్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం... కుమార్తె జీవితాన్ని ఛిద్రం చేసింది.

 • ఆణిముత్యాలు May 22, 2017 22:50 (IST)
  తెలంగాణ ఎంసెట్‌లో జిల్లా విద్యార్థులు మెరిశారు. రాష్ట్రస్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించారు. ఎంసెట్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో తాడిపత్రి పట్టణంలోని జయనగర్‌ కాలనీకి చెందిన చాగం దిలీ‹ప్‌కుమార్‌రెడ్డి తెలంగాణ స్టేట్‌లో ఆరో ర్యాంకు , గుంతకల్లుకు చెందిన బి.రాజేష్‌ 738వ ర్యాంకు సాధించారు.

 • వర్గపోరుతో నిధుల వాపస్‌ May 22, 2017 22:47 (IST)
  కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ వర్గాలకు చెందిన కౌన్సిలర్ల మధ్య విభేదాల నేపథ్యంలో దళితవాడల అభివృద్ధి కోసం మంజూరైన రూ.3.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.

 • నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి May 22, 2017 22:46 (IST)
  జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌ వీరపాండియన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

 • సమస్య మూలాల్లోకి కలెక్టర్‌ May 22, 2017 22:44 (IST)
  మీకోసం కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న వినతిపత్రాలపై కలెక్టర్‌ వీరపాండియన్‌ క్షేత్రస్థాయి అధికారులతో అప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. సంబంధిత అధికారులకు అర్జీదారులను చూపిస్తూ ....

 • నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్ట్‌ చేయాలి May 22, 2017 22:41 (IST)
  టీడీపీ హత్యా రాజకీయాలపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం టీ సర్కిల్‌లో ధర్నా చేశారు.

 • రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి May 22, 2017 22:39 (IST)
  రెడ్డికులస్తులు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం చెళ్లికెర తాలూకా తిప్పరెడ్డిపల్లిలో సోమవారం యోగి వేమన తల్లి వేమారెడ్డి మల్లమ్మ 595వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

 • ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం మార్పు May 22, 2017 22:37 (IST)
  స్థానిక విద్యుత్‌నగర్‌ సర్కిల్‌లోని సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయాన్ని టీవీ టవర్‌ వెనుక ఉన్న భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా సోమవారం నూతన భవనంలో పూజలు నిర్వహించారు.

 • అనుమానంతో భార్యపై దాడి May 22, 2017 22:35 (IST)
  అనుమానంతో తన భర్త గోపాల్‌నాయక్‌ నిత్యం తనను వేధిస్తున్నాడని, అంతటితో ఆగక దాడి చేసినట్లు చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన కృష్ణమ్మబాయి అనే ఆమె పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది.

 • అప్పణంగా భోంచేశారు! May 22, 2017 22:33 (IST)
  విద్యార్థుల సొమ్ముతో నడిచే జేఎన్‌టీయూ(అనంతపురం) ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అవకాశం ఉన్న ప్రతిచోటా విద్యార్థుల సొమ్మును స్వాహా చేశారు. చలానాకు బదులు నగదు రూపంలో మెస్‌ బిల్లులు వసూలు చేయడమే కాకుండా వాటికి లెక్కలు చూపకుండా దారి మళ్లించేశారు. హాస్టల్‌ అధికారుల చేతివాటంపై విద్యార్థులు మండి పడుతున్నారు.

 • టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు May 22, 2017 22:32 (IST)
  టీడీపీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. మొన్నటికి మొన్న నియోజకవర్గంలో మండల కన్వీనర్ల ఎంపిక ప్రక్రియలో అసంతృప్తి జ్వాలలు రేగగా.. తాజాగా శింగనమల మండలంలో ఆ పార్టీ ఎంపీటీసీలే అడ్డం తిరిగారు. తమకు నిధులు ఇవ్వడం లేదంటూ ఎంపీపీపై ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు.

 • ‘విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు’ May 22, 2017 22:29 (IST)
  అవినీతి రాజకీయాలను పారదోలే శక్తి కలిగిన విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను సోమవారం మండలంలోని బుగ్గ సంగమేశ్వరాల దేవాలయం ప్రాంగణంలో ప్రారంభించారు.

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC