ఆ వజ్రాయుధమే చంద్రబాబుపై బ్రహ్మాస్త్రం

ఆ వజ్రాయుధమే చంద్రబాబుపై బ్రహ్మాస్త్రం - Sakshi


ఫ్లోరిడా: ఏపీలోని చంద్రబాబునాయుడు సర్కార్ సోషల్ మీడియాపై సైతం ఆంక్షలు విధించేందుకు యత్నించడంపై ఖండాంతరాల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు తమ మద్ధతు తెలుపుతూ అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు, తెలుగు కమ్యూనిటీ నేతలు సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో జరిగిన భేటీలో ఏపీలో సోషల్ మీడియాపై ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. తక్షణమే ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను, బెంగళూరులో అరెస్ట్ చేసిన రవీంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



వైఎస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి మాట్లాడుతూ.. అధికారం అనేది శాశ్వతం కాదని, వినాశకాలే విపరీత బుధ్ది అని హితవు పలికారు. సోషల్ మీడియా మీద మీ అరాచకాలు ఇకనైనా ఆపేయాలని సూచించారు. సోషల్ మీడియా సామాన్యుడి వ్రజాయుధమని.. ఈ ఆయుధాన్ని బ్రహ్మాస్త్రంగా చేసుకుని మీపై యుద్ధం చేసి మీ అధికారానికి స్వస్తి చెబుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రవికిరణ్‌ను, రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మీడియాను ఎల్లో మీడియాగా చేసి అబద్ధాన్ని నిజం చేయాలని తాపత్రయపడుతున్నారని, అది ఎంతో కాలం సాగదన్నారు.



ఏపీ ప్రభుత్వం అరాచకాలను భయటపెట్టేలా నెటిజన్లు పోస్టులు చేయడాన్ని ప్రజాభిప్రాయంగా స్వీకరించాలని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డా.వాసుదేవరెడ్డి, డాక్టర్ శ్రీదర్‌రెడ్డి కొర్సపాటి, వెంకట్ పులి, మల్లికార్జునరెడ్డి, కేశవ్, మాదవ్, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, రవి, సుబ్బారెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top