కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష: గువ్వల బాలరాజు

కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష: గువ్వల బాలరాజు


లండన్: టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏమ్మెల్యే గువ్వల బాలరాజుతో లండన్‌లో నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో యూకే నలుమూలల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఉద్యమ సమయం నుండి నేటి వరకు పార్టీలోని అనుభవాలని, కేసీఆర్ ప్రజారంజక పాలన గురించి గువ్వల బాలరాజు కార్యవర్గ సభ్యులతో పంచుకున్నారు.  ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర గొప్పదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని – పథకాల గురించి వివరించారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఆహార్నిషలు కష్టపడుతున్నారని ఆయన నాయకత్వమే ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు.



తనను వ్యక్తిగతంగా గానీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అన్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ప్రతినిధులు బాలరాజుని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అశోక్ దూసరి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ, ఈస్ట్ లండన్ కో-ఆర్డినేటర్ రమేష్ ఏసంపల్లి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, సత్య చిలుముల, వెస్ట్ లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం, ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, వెంకీ తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top