నీతి మాటలు ఎక్కడికి పోయాయి చంద్రబాబు

నీతి మాటలు ఎక్కడికి పోయాయి చంద్రబాబు


కువైట్ :

రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్ నరసింహన్ వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వారిని టీడీపీలో మంత్రి పదవులకు ప్రమాణస్వీకారం చేయించడం దారుణమని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు అన్నారు. ఈ పరిణామాలను చూస్తూంటే ఆయన గవర్నరా..?  లేక టీడీపీ పార్టీ కార్యకర్తా..? అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని తెలిపారు.



వైఎస్ఆర్సీపీ టికెట్పై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపజేశారని మండిపడ్డారు. 21మంది ఎమ్మెల్యేలను రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలి.  కానీ, ఆలా జరగకుండా స్పీకర్ ఆ 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా రాజ్యాంగాన్ని అవమానించే వ్వక్తి  స్పీకర్గా ఉండటం అసెంబ్లీకే అవమానమని పేర్కొన్నారు.



తెలంగాణాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి తీసుకుపోయి మంత్రి పదవి ఇస్తే సత్యహరిచంద్రుడికే తాతలా చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడారని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు గుర్తు చేశారు. మరి ఈ రోజు చంద్రబాబు నీతి మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. అంటే మీరు పక్కవాడికి చెప్పుకోడానికే నీతులా..? మీరు చేయడానికి కాదా..?

అని మండిపడ్డారు.



చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలేనని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు నిప్పులు చెరిగారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం..  దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే తమ పార్టీ చేసిన సవాల్ స్వీకరించాలని సవాలు విసిరారు. వైఎస్ఆర్సీపీ టికెట్ పై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి ఎవరి సత్తా ఏమిటో తేల్చుకోవాలన్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా టీడీపీ నడుచుకోవడంతో దీన్ని ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారని తెలిపారు.



రాజ్యాంగ విరుద్దమైన పనులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు మెడలు వంచేదుకు వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు నిరసన ధర్నాచేపట్టారు. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి నరసారెడ్డి, ట్రేజరర్ నాయని మహేష్ రెడ్డి, ఆకుల చలపతి, షేక్ కలామ్, యూత్ టీం ఇంచార్జీ, మర్రి కళ్యాణ్, యూత్  నాయకులు సయ్యద్ సజ్జాద్, రఫీక్ ఖాన్, షేక్ సర్దార్, రావురి రమణ, హనుమంత్ రెడ్డి, కల్లూరి వాసు, బి.యన్.సింహ రెడ్డి, ఓబులపు మోహన్ రెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, గోవిందు రాజు, శివ బాల, రవి శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top