ఉపాధి కోసం వెళ్లి..సౌదీలో అనాథ శవాలుగా..


మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి..



దుబాయ్‌: పొట్ట చేతబట్టుకొని సౌదీ అరేబి యాకు వెళ్లిన ఇద్దరు భారత కార్మికులు శవాలుగా మారారు. రియాద్‌లో ఒకే భవన నిర్మాణ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన పొన్నం సత్యనా రాయణ (48) మార్చి 11న, పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాకు చెందిన జస్వీందర్‌ సింగ్‌ (56) ఫిబ్రవరి 21న మరణించారు. అక్కడి కంపెనీ యజమానులు ఆర్థిక సాయానికి నిరాకరించి, మృతదేహాలను పట్టించుకోకపోవడంతో వారి శవాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోయాయి. ఈ మేరకు అక్కడి వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.



వారి మరణాలకు గల కారణాలు తెలియ రాలేదు. 20 ఏళ్ల నుంచి వారు అక్కడే కూలీలుగా పనిచేస్తున్నారు. అక్కడి చట్టాల ప్రకారం యజమానులే మృతదేహాలను స్వదే శానికి పంపాలి. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే వీరితో పాటు కొంతమందిని ఆ కంపెనీ తొలగించింది. పదవీ విరమణ ఫలాలు కోసం వారు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలోనే మరణించారు. అక్కడి తోటి కార్మికులు మాట్లాడుతూ ఏడాదిన్నరగా జీతాలు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నా మని, వారి మరణం మమ్మల్ని ఎంతగానో బాధించిందని వాపోయారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top