మార్కెట్ అంచనా..


ముంబై:  సోమవారం  నాటి ఫ్లాట్ గా మొదలైన మార్కెట్లు చివరికి భారీ లాభాల్లో ముగిసాయి. విశ్లేషకులు అంచనాలకునుగుణంగానే మార్కెట్లు కొద్దిగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ పటిష్టంగా ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్  కీలక మద్దుత స్థాయిలకు పైన స్థిరంగా నిలబడి మదుపర్లు ఆశలు చిగురింప చేశాయి.  మంగళవారం కూడా మార్కెట్లలో సానుకూలతలు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని కీలక ఫలితాల కారణంగా ఎంపిక చేసిన స్క్రిప్‌లలో చలనాలు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.  సింగపూర్ ఎక్స్చేంజ్   ట్రేడింగ్ నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో నడుస్తోంది. దీంతో  సెన్సెక్స్, నిఫ్టీ, సెన్సెక్స్ నిఫ్టీ మంగళవారం ఆసియా స్టాక్ మార్కెట్లు భిన్నంగా ఉన్నప్పటికీ పాజిటివ్ గా  ఉండొచ్చని అంచనా.  విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వైఖరి  దేశీయ ఈక్విటీల్లో స్థిరత్వం దారితీస్తోంది.  నగదు మార్కెట్లలో వారి కొనుగోళ్ల పరంపరను కొనసాగునుందని మార్కెట్ల వర్గాలు అంచనా   వేస్తున్నాయి



దాదాపు ఆరు  సంస్థలు నేడు ఫలితాలను వెల్లడించనున్నాయి. సిమెంట్ మేజర్లు ఏసీసీ,  అంబుజా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఆటో సంస్థ మారుతి సుజుకి  బజాజ్ ఫినాన్స్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఐడిఎఫ్ సీ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి. వీటిలో మారుతీ సుజుకీ ప్రధానమైనది. నికర లాభం 2.8 శాతం పెరగొచ్చని మార్కెట్ వర్గాల  అంచనాలున్నాయి. మరోవైపు  నేడు, రేపు జరగనున్న యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి విధాన సమీక్షపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. కీలక రేట్లను యథాతథంగా ఉంచవచ్చన్న అంచనాలున్నప్పటికీ.. యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌పర్సన్‌ జానెట్‌ యెలెన్‌ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. అలాగే నిన్నటి బ్యాంకింగ్ సెక్టార్ లో కొనసాగిన లాభాల కారణంగా ఈ రోజు ప్రాఫిట్  బుకింగ్ కు ఆస్కారం ఉందని ఎనలిస్టుల అంచనా. అటు ఆసియన్  మార్కెట్లు  మిశ్రమంగా  ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా ఫ్లాట్ గా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఫెడ్ రేట్ల అంచనాలతో డాలర్ బలహీనంగా ఉండగా  చైనా  యెన్ బలపడింది.  అమెరికా, జపాన్  కేంద్ర బ్యాంకు సమావేశాలు, ఆయిల్ సెక్టార్  ప్రధాన అంశాలు కానున్నాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top