భువనగిరిలో విజన్ కౌంటీ!

భువనగిరిలో విజన్ కౌంటీ!


 సాక్షి, హైదరాబాద్: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అలా అని సిటీ కి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇల్లుండటం కాదు. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు లభించాలి. అప్పుడే అది అఫడబుల్ హౌజింగ్ అవుతుందంటున్నారు విజన్ ఇండియా డెరైక్టర్ లింగమయ్య. అందుకే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్, బెంగళూరు హైవేల్లో అందుబాటు ధరల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామన్నారు.



పూర్తి వివరాలివిగో..

 హైదరాబాద్ దక్షిణ దిశ ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలు అందుబాటులో లేక నివాస, వాణిజ్య సముదాయాలు తూర్పు దిశకు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతుండటం, ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలకు తోడు పోచారంలో ఐటీఐఆర్ ప్రాజెక్టూ రానుండటం వంటి కారణాలతో ఉప్పల్, ఘట్‌కేసర్, భువనగిరి ప్రాంతాలకు డిమాండ్ బాగా పెరిగింది. సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా భువనగిరిలో 15 ఎకరాల్లో ‘విజన్ కౌంటీ’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 200- 500 చ.గ. ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది.



 బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ పేరుతో మరో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాం. 150 - 650 చ.గ. మధ్య మొత్తం 208 ఓపెన్ ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నాం. దీనికి దగ్గర్లోనే మరో 50 ఎకరాల్లో విజన్ ప్రైడ్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. ఫేజ్-1లో 25 ఎకరాల్లో మొత్తం 300 ఓపెన్ ప్లాట్లొస్తాయి. త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

 

విజన్ ప్యారడైజ్ ప్రాజెక్ట్‌కు ఆనుకొనే వందల ఎకరాల్లో జాన్సన్ అండ్ జాన్సన్, పీ అండ్ డబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. దీంతో సమీప భవిష్యత్తులో కొత్తూర్ ప్రాంతంలో వేల కుటుంబాలు నివాసం ఏర్పరుచుకోనున్నాయి. అందుకే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 3 నెలల్లోనే 50 శాతం విక్రయాలైపోయాయంటే ఇక్కడి గిరాకీ, భవిష్యత్తు అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top