భారీగా తగ్గిన విశాల్ సిక్కా వేతనం

భారీగా తగ్గిన విశాల్ సిక్కా వేతనం

ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా వేతనం భారీగా తగ్గింది. తక్కువ బోనస్ చెల్లింపులతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో  సిక్కాకు చెల్లించే వేతనం 67 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టులో విశాల్ సిక్కాకు నగదు కింద చెల్లించే వేతనం రూ.16.01 కోట్లేనట. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో ఆయన రూ.48.73 కోట్లను పొందారు. అదేవిధంగా స్టాక్ గ్రాంట్స్, రిటైరల్ ప్రయోజనాలరూపంలో సిక్కాకు ఇచ్చే మొత్తం పరిహారాలు కూడా 7 శాతం పడిపోయి, రూ.45.11 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థికసంవత్సరంలో వీటి కింద రూ.48.41కోట్లను పొందారు.  

 

అయితే సిక్కా బేస్ శాలరీ 9 లక్షల డాలర్ల(రూ.5,82,45,750) నుంచి 10 లక్షల డాలర్ల(రూ.6,47,08,500)కు పెరిగింది. ఈయన బోనస్ లు, ఇతర ప్రోత్సహకాలు మాత్రం 0.82 మిలియన్ డాలర్లకు(రూ.5,30,60,970) తగ్గాయి. అదేవిధంగా నియంత్రిత స్టాక్ యూనిట్లను కూడా గతేడాది మాదిరిగా 2 మిలియన్ డాలర్లను మాత్రమే ఇచ్చారు. పనితీరు ఆధారితంగా ఇచ్చే స్టాక్ ప్రోత్సహకాలు గతేడాది ఏమి లేకపోగా, ఈ ఏడాది 2.88 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

 

కాగ ఇతర సీనియర్  ఎగ్జిక్యూటివ్ లకు పరిహారాలు భారీగా పెరుగగా, ఇదే సమయంలో విశాల్ సిక్కాకు చెల్లించే మొత్తం పరిహారాలు తగ్గినట్టు వార్షిక రిపోర్టులో తెలిసింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు మొత్తం వేతనం రూ.8.14 కోట్ల నుంచి రూ.11.80 కోట్లకు పెరిగింది. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవికుమార్ ఎస్ వేతనం కూడా రూ.8.27 కోట్ల నుంచి రూ.14.87కోట్లకు పెరిగింది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top