వాడవాడలో వాకతిప్పలు!

వాడవాడలో వాకతిప్పలు! - Sakshi


కర్నూలు

  జిల్లాలో వాడవాడలో ‘వాకతిప్ప’లు వెలుస్తున్నారుు. ఎటువంటి అనువుతులు లేకుండా వీధికొక బాణసంచా షాపులు దర్శనమిస్తున్నారుు. ఒకవైపు తూర్పుగోదావరి జిల్లా వాకతిప్ప ఘటనలో ఏకంగా 12 వుంది దుర్మరణం పాలైన సంఘటన కళ్ల వుుందు మెదులుతున్నా జిల్లా అధికార యుంత్రాంగానికి చీవుకుట్టినట్టు కూడా లేదు.



ఇళ్ల వుధ్యే బాంబుల షాపులు ఏర్పాటవుతున్నా కివ్మునకుండా ఉంటున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అక్రవు నిల్వలు ఉన్నాయుని తెలిసినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారనే వివుర్శలు వినిపిస్తున్నారుు. అనువుతి తీసుకుని ఏర్పాటవుతున్న షాపుల్లోనూ నిబంధనలు పాటించడం లేదు. మొత్తం మీద ఇళ్ల వుధ్య వెలుస్తున్న షాపులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.



 ఇళ్ల మధ్యే దుకాణాలు

 దీపావళి పండుగ అంటే అందరూ సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లోను పండుగను పురస్కరించుకుని బాంబుల మోతతో వెలుగులు విరజిమ్ముస్తుంటారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు బాంబుల విక్రయాలతో వ్యాపారాన్ని మూడు చిచ్చుబుడ్లు.. ఆరు కాకరవొత్తులగా కొనసాగిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. అనుమతులు లేకుండానే ఇళ్ల మధ్యే షాపులు ఏర్పాటు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 220 దుకాణాలకు మాత్రమే అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతి(ఎన్‌ఓసీ) ఇచ్చారు. అవి కూడా గృహ సముదాయాలు లేని గ్రౌండ్లలో ఏర్పాటు చేసుకోవాలి.



అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు వెలుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా వాకతిప్పలో బాణ సంచా పేలుడు ప్రమాదం జరగడంతో జిల్లాలోను వాటి నిల్వలు ఉన్న ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు పట్టణాల్లో నివాస ప్రాంతాల్లోనే బాణసంచా నిల్వ చేయడం, తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది.



కర్నూలు నగరంలోని బొంగుల బజార్‌లో భారీ ఎత్తున బాణసంచా నిల్వలు వెలిశాయి.  ఐదుగురికి హోల్‌సేల్ అనుమతులు ఉండగా వారి కనుసన్నల్లోనే మరో పది మందికి పైగా గుట్టుగా భారీ ఎత్తున నిల్వ ఉంచి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో బొంగుల బజార్‌లో ఓ గోదాములో పెద్ద ఎత్తున బాణసంచా ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయినప్పటికీ వ్యాపారులు కొంతమంది ఇళ్లమధ్యనే నిల్వలు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.



 ఆదోనిలో మునిసిపల్ భవన్‌లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అనుమతించినప్పటికీ జనరల్ స్టోర్స్, కిరాణం అంగళ్లలో బాణసంచా వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోని అన్ని పట్టణాల్లో కూడా ఇదే తరహాలోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.



 పాతబస్తీలో భారీగా నిల్వలు...

 దీపావళి పండుగను పురస్కరించుకుని వారం రోజులు ముందే కర్నూలు నగరం పాతబస్తీలో బాణసంచాను వ్యాపారులు భారీగా దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమతులు తీసుకోకుండానే రహస్య గోదాముల్లో నిల్వ చేసినట్లు వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న గోదాముల్లో కూడా బాణసంచాను నిల్వ చేశారు. అయితే అనుమతులు లేకుండా వెలుస్తున్న దుకాణాలు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top