టెక్ మహీంద్రా లాభం 20% డౌన్

టెక్ మహీంద్రా లాభం 20% డౌన్


1:1బోనస్ ఇష్యూ, షేరు విభజన

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం (కన్సాలిడేటెడ్) 20% క్షీణించి రూ. 805 కోట్లుగా నమోదైంది. కరెన్సీ మారకం విలువపరృమెన నష్టాలు, వేతనాల పెంపు ఇందుకు కారణం. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిృో లాభం రూ. 1,010 కోట్లు. ఇక తాజా క్యూ3లో ఆదాయం రూ. 4,899 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ. 5,752 కోట్లకు పెరిగింది.  



వేతనాల పెంపు, కరెన్సీ హెచ్చుతగ్గులు, పన్నులకు అధిక ప్రొవిజనింగ్ తదితర అంశాలు లాభాలపై ప్రభావం చూపినట్లు సంస్థ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలిపారు. కరెన్సీపరమైన ఒత్తిళ్లు ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. మరోవైపు మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు మరింత అవకాశం ఉందని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాణీ చెప్పారు.



240 మిలియన్ డాలర్లతో తలపెట్టిన లైట్‌బ్రిడ్జి కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ కొనుగోలు ప్రక్రియ ఫిబ్రవరిలో పూర్తి కావొచ్చని ఆయన వివరించారు. మరోవైపు, ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1) బోనస్‌గా ఇవ్వాలని, ఒక్కో షేరును రెండు కింద విభజించాలని బోర్డు నిర్ణయించింది. కంపెనీ ఆదాయాల్లో రూ. 5,254 కోట్లు ఐటీ వ్యాపారం నుంచి రాగా, మిగతాది బీపీవో విభాగం నుంచి వచ్చిందని గుర్నాణీ వివరించారు. మరోవైపు, క్యూ3లో కొత్తగా మరో 2,700 మందిని రిక్రూట్ చేసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 98,000కి చేరినట్లు ఆయన తెలిపారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 15 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్లు గుర్నాణీ పేర్కొన్నారు.

 

కంపెనీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో సుమారు 1 శాతం క్షీణించి రూ. 2,878.30 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top