టాటా నానో జెన్ ఎక్స్ వస్తోంది..

టాటా నానో జెన్ ఎక్స్ వస్తోంది..


పుణె: రతన్ టాటా ప్రజల కారుగా సుపరిచితమైన ‘నానో’కు మరిన్ని మెరుగులుదిద్ది ‘జెన్‌ఎక్స్ నానో’గా తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ రంగం సిద్ధం చేసింది. 2009లో తొలిసారిగా ఆవిష్కరించిన నానోకు చౌక కారు ముద్రను తొలగించడంతోపాటు తొలిసారి కారు కొనుగోలు చేసే కస్టమర్లను ఆకర్షించేలా జెన్‌ఎక్స్ నానోకు కొత్త హంగులన్నీ చేర్చింది. ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, బ్లూ టూత్ ఫోన్ సింక్ ఆడియో సిస్టమ్, ఓపెనబుల్ బూట్ వంటి ఫీచర్లు దీనిలో ఉంటాయని సమాచారం. 6-7 వారాల్లో ఈ కొత్త నానో మార్కెట్లోకి రావచ్చని అంచనా.



జెన్ ఎక్స్ రాక తో పాత నానో రేంజ్‌కు(సీఎన్‌జీ వెర్షన్ తప్ప) కంపెనీ స్వస్తి పలకనుంది. టాటా మోటార్స్‌కు నానో కీలకమైన ఉత్పత్తి అని.. దీన్ని వదిలించుకునే ప్రసక్తే లేదని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top