రూ. 2,000 కోట్లు కట్టండి..

రూ. 2,000 కోట్లు కట్టండి.. - Sakshi


లెసైన్సుల విలీన ప్రక్రియలో వొడాఫోన్కు సుప్రీం సూచన



న్యూఢిల్లీ: వేర్వేరుగా ఉన్న నాలుగు లెసైన్సుల విలీనానికి  రూ. 2,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ (వీఎంఎస్ఎల్)కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ చెల్లింపులు ఎప్పుడు పూర్తయితే అప్పుడు... కేంద్రం విలీన ప్రక్రియకు అనుమతిస్తుందని న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. లెసైన్సుల తాత్కాలిక విలీనానికి అనుమతి ఇస్తూ... టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఇచ్చింది.

 

ఐపీఓ బాటలో...



భారత్‌లో అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రావాలని వొడాఫోన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా నాలుగు వేర్వేరు లెసైన్సులను (వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సెల్యులార్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ డిజిలింక్)ను తనలో విలీనం చేసుకోవాలని వీఎంఎస్ఎల్ భావిస్తున్నట్లు సమాచారం.  విలీన ప్రక్రియకు వివిధ విభాగాల కింద దాదాపు రూ.6,678 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసు విచారణ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి తెలిపారు. వీటిలో వన్టైమ్ స్పెక్ట్రమ్ చార్జ్, అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిల వంటివి  ఉన్నాయని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top