కొత్త గరిష్టాల నుంచి నష్టాల్లోకి

కొత్త గరిష్టాల నుంచి నష్టాల్లోకి


సెన్సెక్స్ 145 పాయింట్లు డౌన్

26,127 వద్ద ముగింపు

8 రోజుల వరుస లాభాలకు బ్రేక్

వారాంతం రోజున కూడా ఇటీవల అలవాటైన బాటలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలోనే ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 26,300కు, నిఫ్టీ 7,841కు చేరాయి. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఆపై అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. రోజు మొత్తం ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 26,007 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరికి 145 పాయింట్ల నష్టంతో 26,127 వద్ద ముగిసింది. ఇదే విధంగా కదలిన నిఫ్టీ సైతం 40 పాయింట్లు క్షీణతతో 7,790 వద్ద స్థిరపడింది. వెరసి 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ కాలంలో సెన్సెక్స్ 1,265 పాయింట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ 5% డౌన్: ప్రధానంగా రియల్టీ, మెటల్, పవర్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 3-1.5% మధ్య తిరోగమించగా, ెహ ల్త్‌కేర్ 2% ఎగసింది. హెల్త్‌కేర్ షేర్లలో వొకార్డ్ 14% జంప్‌చేయగా, గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, లుపిన్, క్యాడిలా హెల్త్ 7-2% మధ్య పుంజుకున్నాయి.

 

కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఊరట

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌పై ఐపీవో స్కాంలో సెబీ విధించిన ఆరు నెలల నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేను పొడిగించింది. ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ స్టే కొనసాగుతుంది. అంతకుముందు 2003-2005 ఐపీవోలో జరిగిన అవకతవకలను సెబీ నిర్థారిస్తూ ఆరు నెలల పాటు కొత్త పథకాలను, కొత్త కార్యక్రమాలను చేపట్టకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top