ఆ ఏటీఎం కార్డులను బ్లాక్‌ చేస్తున్న ఎస్‌బీఐ

ఆ ఏటీఎం కార్డులను బ్లాక్‌ చేస్తున్న ఎస్‌బీఐ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కొందరి ఖాతాదారుల డెబిట్‌ కార్డులను శాశ్వతంగా బ్లాక్‌ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సమాచారాన్ని కస్టమర్లకు మెసేజ్‌ల రూపంలో అందిస్తోంది. అయితే ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. భద్రతా కారణాల నేపథ్యంలో మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డులను ఈవీఎం చిప్‌ డెబిట్‌ కార్డులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు బ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రతా కారణాలతో మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డును శాశ్వతంగా బ్లాక్‌ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకును కాంటాక్ట్‌ చేయాలని లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌(www.onlinesbi.com ) ద్వారా కార్డులను మార్చుకోవాలని బ్యాంకు సూచించింది. ఈవీఎం చిప్ డెబిట్‌ కార్డులను బ్యాంకు ఉచితంగానే కస్టమర్లకు అందిస్తోంది. 

 

మ్యాగ్నిటిక్‌ స్ట్రైప్‌ ఆధారిత ఏటీఎంలు, డెబిట్‌ కార్డులను ఈవీఎం చిప్‌, పిన్‌ ఆధారిత మోడల్‌లోకి మార్చాలని గతేడాదే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. మ్యాగ్నిటిక్‌ స్ట్రైప్‌ ఆధారిత ఏటీఎం, డెబిట్‌ కార్డులతో జరుగుతున్న మోసాల నుంచి రక్షించడానికి, ఈవీఎం చిప్‌, పిన్‌ ఆధారిత మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. 2017 సెప్టెంబర్‌ 30 వరకు అన్ని బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు చిప్‌ కార్డు ఆధారిత ఏటీఎం మోడల్స్‌లోకి మారాల్సిందేనని తెలిపింది. 

 

మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డంటే..?

డెబిట్‌ కార్డును దగ్గరగా పట్టుకుని చూస్తే, కార్డు వెనుకాల నల్లటి మ్యాగ్నిటిక్‌ స్ట్రిప్‌ ఉంటుంది లేదా ముందువైపు చిప్‌ ఉంటుంది లేదా ఈ రెండూ ఉండొచ్చు. ఈ కార్డులు సిగ్నేచర్‌ ఆధారితంగా ఉంటాయి. చిన్న అయస్కాంతాలతో ఈ స్ట్రిప్‌ తయారవుతుంది. దానిలోనే మీ అకౌంట్ సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top