లీటరుకు 100 కిలోమీటర్లిచ్చే కారు!!

లీటరుకు 100 కిలోమీటర్లిచ్చే కారు!! - Sakshi


సాధారణంగా ఏ కారైనా ఎంత మైలేజి ఇస్తుంది.. మహా అయితే 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో కదూ. పెట్రోలు గానీ, డీజిల్ గానీ ఏ ఇంధనం వాడినా ఇంతకంటే ఎక్కువ రావడం దాదాపుగా అసాధ్యం. అసలు గట్టిగా మాట్లాడితే బైకులు కూడా 60-80 కిలోమీటర్లకు మించి మైలేజి ఇవ్వవు. కానీ, ఏదైనా కారు లీటరు పెట్రోలుకు 100 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందంటే మీరు నమ్మగలరా? నమ్మితీరాల్సిందే. ఎందుకంటే.. రెనో కంపెనీ తాము కొత్తగా తయారుచేస్తున్న 'ఇయోల్యాబ్' అనే కారు కేవలం ఒక్క లీటరు పెట్రోలు పోస్తే చాలు.. ఎంచక్కా వంద కిలోమీటర్లు పరుగు తీస్తుందట. దీన్ని తొలిసారిగా ప్యారిస్ మోటారు షోలో ప్రదర్శించారు.



ఇంధనాన్ని అత్యంత తక్కువగా వినియోగించుకునే కారు రూపొందించాలన్న ఉద్దేశంతో రెనో కంపెనీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారుచేసినట్లు చెబుతున్నారు. కార్లను కేవలం షోరూంలో చూసి, ఫొటోలు చూసి ఆనందించాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదని, తమ కొత్త టెక్నాలజీ సాయంతో కారును సొంతం చేసుకోవచ్చని రెనో కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బి-సెగ్మెంటు కారుగా చెబుతున్న దీని కోసం కొత్తగా 100 కొత్త టెక్నాలజీలు ఉపయోగించారు. దీనికోసం ఏరోడైనమిక్స్ను పూర్తిగా మార్చారు, బరువు తక్కువ పెట్టారు, దానికి తోడు హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడారు. అంటే ఈ కారు ఇటు పెట్రోలుతోను, అటు కరెంటుతోను కూడా నడుస్తుందన్నమాట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top