కొత్త రూ.50 నోట్లు, భలే ఉన్నాయి..






ముంబై :
  దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా మరో కొత్త బ్యాంకు నోట్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. త్వరలోనే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త రూ.50 నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతున్నట్టు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో వీటిని ఆర్బీఐ విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ నోట్లపై ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉంటుందని కూడా తెలిపింది. ఈ బ్యాంకు నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మ, మరోవైపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథోత్సవం బొమ్మ ఉంటుందని తెలిసింది. ఈ నోట్ల బేస్‌ కలర్‌ ఫ్లోర్‌సెంట్‌ బ్లూ. ఈ బ్యాంకు నోటు పరిణామం 66 mm x 135 mm. కొత్తగా రూ.20, రూ.50 నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిజర్వు బ్యాంకు గతేడాది డిసెంబర్‌లోనే తెలిపింది.

 

కాగ త్వరలో విడుదల కాబోతున్న కొత్త రూ.50 నోట్లతో పాటు, ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పాత రూ.50 కరెన్సీ నోట్లు కూడా చట్టబద్ధంగానే కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు నోట్ల ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్‌లో ఏర్పడిన చిల్లర నోట్ల సమస్యతో ఆర్బీఐ తక్కువ విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. త్వరలోనే రూ.200 నోట్లు కూడా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top