వస్త్ర ఎగుమతుల్లో చైనాను అధిగమించగలం..

వస్త్ర ఎగుమతుల్లో చైనాను అధిగమించగలం..


చైనాలో పెరుగుతున్న వేతనాలు

ఇతర రంగాలకు కార్మికుల వలస

భారత్‌కు ఇదే తగిన సమయం

రేమండ్ బ్రాండెడ్ షర్టింగ్ హెడ్ రాజీవ్ బజాజ్


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల ఎగుమతుల్లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న చైనాలో ఇప్పుడు పరిస్థితులు తారుమారవుతున్నాయి. వేతనాలు గణనీయంగా పెరిగాయి.



కార్మికులు ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా ఎగుమతులు తగ్గుముఖం పట్టనున్నాయి. దీన్ని అవకాశంగా మల్చుకోవడానికి భారత్‌కు తగిన సమయమిదేనని అంటున్నారు రేమం డ్ బ్రాండెడ్ షర్టింగ్ బిజినెస్ హెడ్ రాజీవ్ బజాజ్. రేమండ్ నూతన లినెన్ వస్త్ర శ్రేణిని ఆవిష్కరించేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. వస్త్రాలు, దుస్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం నూతన పాలసీని తీసుకు రావాలని అన్నారు. ఆయనింకా ఏమన్నారంటే..

 

చైనాలో ఇదీ పరిస్థితి: ప్రస్తుతం చైనా నుంచి వస్త్రాలు, దుస్తుల వార్షిక ఎగుమతుల పరిమాణం రూ.19 లక్షల కోట్లుంది. తక్కువ ధరకు ముడి సరుకు లభ్యత, తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన మౌలిక వసతులు ఆ దేశంలో ఉన్నాయి. తక్కువ వేతనాలకు పనిచేసే నిపుణులైన పనివారు విరివిగా ఉండడం చైనాకు కలిసొచ్చింది. ఇప్పుడు కార్మికుల వేతనాలు చాలా పెరిగాయి. అంతేగాక వస్త్ర పరిశ్రమ నుంచి బయటకు వచ్చి అధిక ఆదాయం లభించే ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసేందుకు వలస వెళ్తున్నారు. కొన్ని రోజులైతే ఎగుమతుల్లో చైనా వెనుకబడడం ఖాయం.

 

పెట్టుబడులకు రెడీ: కాటన్, పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో భారత్ తనసత్తా చాటుతోంది. ప్రభుత్వం గనక చొరవ తీసుకుంటే చైనాను అధిగమించడం ఖాయం. ఇందుకు కావాల్సిందల్లా మౌలిక వసతులను కల్పించడంతోపాటు వడ్డీ రేట్లు తగ్గించాలి. కార్మిక చట్టాలను సమూలంగా మార్చాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top