స్పైస్‌జెట్ కొత్త ఆఫర్.. రూ.1,899కే టికెట్

స్పైస్‌జెట్ కొత్త ఆఫర్.. రూ.1,899కే టికెట్


న్యూఢిల్లీ: చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. ‘రెడ్ హాట్ ఫేర్స్’ పేరుతో పరిమితకాల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులకు ప్రారంభ ధర రూ.1,899లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. ప్రయాణికులకు ఈ ఆఫర్ జూలై 6 నుంచి 8 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుకింగ్ చేసుకున్నవారు జూలై 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉన్న మధ్యకాలంలో ఎపుడైనా ప్రయాణించవచ్చు. అలాగే ఈ ఆఫర్ ముంబై-గోవా, అహ్మదాబాద్-ముంబై, బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, పుణే-బెంగళూరు తదితర మార్గాల్లోని విమానాలకు మాత్రమే వర్తిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top