ఇంటివద్దకే డీజిల్: అందిస్తున్న తొలిసంస్థ ఇదే!

ఇంటివద్దకే డీజిల్: అందిస్తున్న తొలిసంస్థ ఇదే! - Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం మనకేది కావాలన్నా మార్కెట్లోకి వెళ్లి కొనుక్కోవడం కంటే, ఆర్డర్ చేస్తే చాలు మన ముంగిట్లోకి వచ్చి వాలిపోతుంది. హోమ్ డెలివరీ సేవలు అంతలా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే వాహనదారులు గంటల కొద్దీ ఆయిల్ బంకుల వద్ద క్యూలు కట్టి వేచిచేయాల్సినవసరం లేకుండా, డీజిల్ ను మన ఇంటివద్దనే డెలివరీ చేస్తోంది ఓ స్టార్టప్. ఐఐటి-ధన్బాద్ పూర్వ విద్యార్థి అషీష్ కుమార్ గుప్తా మైపెట్రోల్పంపు పేరుతో  ఈ స్టార్టప్ ను ఏర్పాటుచేశారు. ఈ స్టార్టప్ తో డీజిల్ ను ఇంటివద్ద డెలివరీ చేస్తున్నారు. ఇంటివద్ద డీజిల్ డెలివరీ చేస్తున్న తొలి సంస్థగా ఇది పేరులోకి వచ్చింది. జూన్ 15 నుంచి ఈ కంపెనీ ఈ సేవలను లాంచ్ చేసింది. ఒక్కోటి 950 లీటర్ల సామర్థ్యంతో మూడు డెలివరీ వెహికిల్స్ ను సంస్థ ఏర్పాటుచేసింది. 5వేలకు పైగా లీటర్ల డీజిల్ ను ఈ సంస్థ డెలివరీ చేస్తోంది. ఫిక్స్డ్ డెలివరీ ఛార్జీలతో ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ధరలకే డీజిల్ ను వారు డెలివరీ చేస్తున్నట్టు టైమ్ ఆఫ్ ఇండియా రిపోర్టు నివేదించింది. 

 

100 లీటర్ల వరకు డీజిల్ ను ఒక్కసారి డెలివరీ చేస్తే, దీనికింద 99 రూపాయల ఛార్జీలను తీసుకుంటుంది. అంటే లీటరు ఒక రూపాయల అదనంగా డెలివరీ ఛార్జీలను ఈ సంస్థ వేస్తోంది. ఉచిత యాప్ డౌన్ లోడ్ ద్వారా లేదా ఆన్ లైన్, ఫోన్ కాల్ ద్వారా డీజిల్ ను వాహనాదారులు ఆర్డర్ చేసుకోవచ్చు.  గత ఏప్రిల్ లోనే పెట్రోల్, డీజిల్ ను ఇంటివద్దనే డెలివరీ చేసే అవకాశముందంటూ ఆయిల్ మంత్రిత్వశాఖ ట్వీట్స్ చేసింది. ముందస్తు బుకింగ్ లతో డోర్ డెలివరీ ఆప్షన్లను పరిశీలిస్తున్నామని చెప్పింది. దీంతో బంకుల వద్ద క్యూలను తగ్గించవచ్చని పేర్కొంది. కీలక సమయాల్లో అయితే, బంకుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. దేశంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల డీజిల్, 23.8 మిలియన్ టన్నుల పెట్రోల్ కన్జ్యూమ్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ వినియోగం అధికంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 59,595 పెట్రోలు పంపులున్నాయి. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top