మైక్యామ్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌

మైక్యామ్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌


మ్యూచువల్‌ ఫండ్స్‌ కార్యకలాపాలను సులభంగా, సరళంగా, వేగంగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారా? అయితే ఓసారి ‘మైక్యామ్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌’ యాప్‌ను ఉపయోగించి చూడండి. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.



ప్రత్యేకతలు

అన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లను ఒకే చోటు నిర్వహించుకోవచ్చు. వివిధ రకాల అకౌంట్లు, లాగిన్‌ ఐడీలు, పిన్‌ కోడ్‌లు అవసరం లేదు.



♦  యాప్‌ను ఉపయోగించాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.



ఫోలియోలను క్రియేట్‌ చేసుకోవడం వంటి ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లతోపాటు సిప్‌ వంటి సిస్టమ్యాటిక్‌ ట్రాన్సాక్షన్లను కూడా నిర్వహించొచ్చు.

పోర్ట్‌ఫోలియోను సులభంగా ట్రాక్‌ చేయవచ్చు. సమీక్షించుకోవచ్చు.



♦  యూజర్‌ సమాచార భద్రతకు యాప్‌ భరోసానిస్తోంది. లావాదేవీలకు సంబంధించిన వివరాలేవీ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం కావని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top