కుబేరుల గని.. ముంబై వర్సిటీ

కుబేరుల గని.. ముంబై వర్సిటీ


* పూర్వ విద్యార్థుల్లో 12 మంది బిలియనీర్లు

* టాప్ 10 వర్సిటీల్లో 9వ స్థానం


న్యూఢిల్లీ: అత్యధిక సంఖ్యలో సంపన్నులను సృష్టించిన టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబై తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ముంబై వర్సిటీ నుంచి బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్న వారిలో ఏకంగా 12 మంది బిలియనీర్లుగా ఉన్నారు.  దీంతో కోట్లకు పడగలెత్తిన పూర్వ విద్యార్థులు .. అత్యధిక సంఖ్యలో ఉన్న వర్సిటీల్లో ఒకటిగా ముంబై విశ్వవిద్యాలయం నిల్చింది. అమెరికా వర్సిటీలను మినహాయిస్తే ఇంత ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లను అందించిన ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే. వెల్త్-ఎక్స్, యూబీఎస్ ఈ ఏడాది నిర్వహించిన బిలియనీర్ సెన్సస్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో 25 మంది బిలియనీర్ పూర్వ విద్యార్థులతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (16 మంది), ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం (14 మంది) వరుసగా టాప్ ఫైవ్‌లో ఉన్నాయి.



ముంబై విశ్వవిద్యాలయంలో చదివిన బిలియనీర్ల సంఖ్య.. అటు ఎంఐటీ, ఎన్‌వైయూ, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, డ్యూక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రఖ్యాత వర్సిటీల కన్నా అధికం కావడం గమనార్హం. టాప్ 20 బిలియనీర్ స్కూల్స్‌లో 16 అమెరికాలోనే ఉన్నాయి. మిగతా నాలుగింటిలో.. ముంబై విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (బ్రిటన్), లొమొనొసొవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ(రష్యా), ఈటీహెచ్ జ్యూరిక్(స్విట్జర్లాండ్) ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top