3,700 కోట్లకు లగ్జరీ ఫర్నిచర్ మార్కెట్

3,700 కోట్లకు లగ్జరీ ఫర్నిచర్ మార్కెట్


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలాసవంతమైన ఫర్నిచర్ మార్కెట్ పరిమాణంభారత్‌లో రూ.3,700 కోట్లుందని ఇటలీకి చెందిన షటోవ్‌డాక్స్ తెలిపింది. ఏటా ఈ మార్కెట్ 15-20 శాతం వృద్ధి చెందుతోందని కంపెనీ దక్షిణాసియా హెడ్ క్లెడ్‌విన్ పసానే శుక్రవారం తెలిపారు. మొత్తం మార్కెట్ పరిమాణంలో 60 శాతంమేర విదేశీ ఫర్నిచర్ ఉంటోందని పేర్కొన్నారు.



ఇక్కడి బంజారాహిల్స్‌లో మల్టీబ్రాండ్ ఇటాలియన్ ఫర్నిచర్ షోరూం ‘వాంటో’ ప్రారంభమైంది. ఈ  సందర్భంగా వాంటో సీవోవో ఎల్.అదిత్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటలీ నుంచి ఫర్నిచర్‌ను తెచ్చుకునే కస్టమర్లూ ఉన్నారని చెప్పారు. ఇలా రూ.600 కోట్ల విలువైన ఫర్నిచర్ ఏటా వస్తోందని వివరించారు. లగ్జరీ ఫర్నిచర్ వాడకంలో ఢిల్లీ, ముంబై తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలుస్తుందన్నారు.

 

మరో 45 బ్రాండ్లు..: షటోవ్‌డాక్స్‌కు భారత భాగస్వామిగా వాంటో వ్యవహరిస్తోంది. ఔట్‌లెట్లో ప్రస్తుతం ఎంఅండ్‌డీ, ఫ్లూ, నటుజ్జి వంటి 15 ఇటలీ ఫర్నిచర్ బ్రాండ్లున్నాయి. మరో 45 బ్రాండ్లను పరిచయం చేస్తామని అదిత్ తెలిపారు. బెంగళూరులో వారం రోజుల్లో, ఢిల్లీ, పుణేలో మార్చికల్లా స్టోర్లు ఏర్పాటు చే స్తామన్నారు. ‘ఏటా నాలుగు స్టోర్లు నెలకొల్పాలన్నది ల క్ష్యం. ఒక్కో స్టోర్‌కు రూ.2-3 కోట్ల వ్యయం అవుతుంది. ఫ్రాంచైజీ విధానంలోనూ ఇవి రానున్నాయి’ అని తెలిపారు. వాంటో స్టోర్‌లో ఉత్పత్తుల ధర రూ.9 వేల నుంచి ప్రారంభమై రూ.21 లక్షల వరకు ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top