మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్‌యూవీ

మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్‌యూవీ


న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ లగ్జరీ ఎస్‌యూవీ, జీఎల్‌ఏ క్లాస్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలలో అందిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హెర్డ్ కెర్న్ చెప్పారు. పెట్రోల్ కారు ధర రూ.36 లక్షలని, డీజిల్ కారు ధర రూ.32.75 లక్షలు, రూ.36.9 లక్షలని వివరించారు. ఈ ఏడాది తామమందిస్తున్న ఎనిమిదో కొత్త ఉత్పత్తి ఇదని తెలిపారు. భారత్‌లో ఎస్‌యూవీల విక్రయాలు పెరుగుతుండటంతో ఈ జీఎల్‌ఏ క్లాస్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చామన్నారు.



 కారు ప్రత్యేకతలు

 ఈ కారు గరిష్టవేగం గంటకు 205 కి.మీ.అని, 0-100 కి.మీ. వేగాన్ని 7.6 సెకన్లలలో అందుకోగలదని కెర్న్ పేర్కొన్నారు. ఇంకా ఈ కారులో 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్‌బాక్స్, పెడల్ షిఫ్టర్స్, పెద్ద పనరోమిక్ సన్ రూఫ్, పార్కింగ్ సెన్సర్స్‌తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రిక్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సెన్సర్లు, 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. ఈ కారు మైలేజీ 13.8  కి.మీ.(పెట్రోల్), 17.9 కి.మీ.(డీజిల్) అని తెలిపారు. బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3, ల్యాండ్ రోవర్ ఇవోక్, వొల్వో వీ40లకు ఈ ఎస్‌యూవీ గట్టిపోటీనిస్తుందని వివరించారు. ఈ ఎస్‌యూవీకి 18 రోజుల్లో 600 బుకింగ్స్ వచ్చాయని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top