భారత్‌లోకి మెర్సిడెస్‌-బెంజ్‌ కొత్త కార్లు

భారత్‌లోకి మెర్సిడెస్‌-బెంజ్‌ కొత్త కార్లు

సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ రెండు కొత్త కార్లను భారత్‌లోకి లాంచ్‌ చేసింది. 50 ఏళ్ల ఏఎంజీ బ్రాండు సెలబ్రేషన్స్‌లో భాగంగా వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకటి మెర్సిడెస్‌ ఏఎంజీ జీటీ-ఆర్‌. దీని ధర రూ.2.23 కోట్లు. మరొకటి మెర్సిడెస్‌-ఏఎంజీ రోడ్‌స్టర్‌. దీని ధర రూ.2.19 కోట్లు. ఈ రెండు ప్రొడక్ట్‌లతో మెర్సిడెస్‌-బెంజ్‌ తన ఏఎంజీ పోర్ట్‌ఫోలియోను భారత్‌లో 12 మోడల్స్‌కు పెంచింది. ఏఎంజీ జీటీ3 రేసింగ్‌ కారును స్ఫూర్తిగా తీసుకుని ఏఎంజీ జీటీ-ఆర్‌ను మెర్సిడెస్‌-బెంజ్‌ ప్రవేశపెట్టింది.  

 

మెర్సిడెస్‌ ఏఎంజీ జీటీ ఆర్‌ ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రియర్‌-వీల్‌-డ్రైవ్‌ కారుగా రికార్డుగా పేరులో ఉంది. దీని గరిష్ట స్పీడు గంటకు 317 కిలోమీటర్లు. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వరకు వేగం అందుకుంటుంది. కొత్త ఏఎంజీ జీటీ ఆర్‌ యూనిక్‌గా గుర్తించేటట్టు గ్రీన్‌ రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చింది. ముందు వైపు పనామెరికానా గ్రిల్ ఉంది. 4.0 లీటరు ట్విన్‌ టర్బో వీ8 ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. ఇది 585 హెచ్‌పీ, 700ఎన్‌ఎమ్‌ పీక్‌ టర్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. సెవన్‌ స్పీడు డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఇది రూపొందింది. 

 

ఏఎంజీ జీటీ రోడ్‌స్టర్‌ కూడా 4.0 లీటరు‌, ట్విన్‌-టర్బో వీ8 ఇంజిన్‌ను కలిగిఉంది. కానీ గ్రీన్‌ రంగు కారంతా అవుట్‌పుట్‌ను ఇది అందించదు. 469 హెచ్‌పీ, 630ఎన్‌ఎం అవుట్‌పుట్‌ను మాత్రమే ఇది ఉత్పత్తిచేస్తోంది. జీటీ ఆర్‌ను ఆఫర్‌ చేసే రియర్‌-వీల్‌ స్టీరింగ్‌ను కూడా ఇది కలిగి ఉండదు.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top